బాలీవుడ్ 'కిల్' రీమేక్.. ఈ దర్శకుడు హ్యాండిల్ చేయగలడా?
అదే సమయంలో సినిమాను రీమేక్ చేయాలని కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు.
By: Tupaki Desk | 16 July 2025 11:54 AM ISTబాలీవుడ్ మూవీ కిల్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. లక్ష్య, రాఘవ్ జుయాల్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేయగా.. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం భారీ విజయం సాధించింది. రాత్రికి రాత్రి రైల్లో దొంగలు చొరబడి డబ్బుల కోసం ప్రయాణికులను హత్య చేయగా, వాళ్లను ఎదిరించి హతమార్చుతాడు ఆర్మీ ఆఫీసర్.
ఆ కథతోనే సినిమా తీసి శభాష్ అనిపించుకున్నారు నగేష్ భట్. నిర్మాత కరణ్ జోహార్ మూవీతో మంచి లాభాలు అందుకున్నారు. అలా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా ఓటీటీలో కూడా హిట్ అయింది. నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఎక్కువగా చూశారు. కొన్ని యాక్షన్ సీన్స్ ను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేశారు.
అదే సమయంలో సినిమాను రీమేక్ చేయాలని కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. అప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కిల్ రీమేక్ అవుతుందని వార్తలు వచ్చినా ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు తెలుగులో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కిల్ సినిమాను రీమేక్ చేస్తారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
రాక్షసుడు, ఖిలాడీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన లారెన్స్ తో కాల భైరవ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆ సినిమా కాస్త లేట్ అవుతుందని.. ఆలోపు కిల్ రీమేక్ ను బెల్లంకొండతో చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే.. రమేష్ వర్మ స్వయంగా కిల్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం.
ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రమేష్ వర్మ.. ఒక ఊరిలో మూవీతో డైరెక్టర్ గా మారారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఆయన.. రైడ్ తో మెప్పించారు. రాక్షసుడుతో హిట్ అందుకున్నారు. చివరగా కిలాడీతో డిజాస్టర్ మూటగట్టుకున్నారు. అలా ఇప్పటివరకు ఆయన అందుకున్న హిట్స్ చాలా తక్కువ అనే చెప్పాలి.
దీంతో కిల్ రీమేక్ ను ఎలా తీస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. కిల్ మూవీలో మితిమీరిన వయొలెన్స్ ఉంటుంది. సినిమా అంతా యాక్షన్ సీన్లే. ఫుల్ స్టంట్స్, ఫైట్స్ కూడా ఉంటాయి. దీంతో వాటిని రమేష్ వర్మ సరిగ్గా డీల్ చేస్తారో లేదోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
కాగా, బెల్లంకొండ ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఏ మూవీ ముందు రిలీజ్ అవుతుందో అప్డేట్ లేదు. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ కిల్ రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
