Begin typing your search above and press return to search.

బెల్లంకొండ నెక్స్ట్.. ఇండియాని షేక్ చేసేలా ఉంటుందట!

లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడితో రూపొందే “హైందవం” సినిమా ఇండియావంతా షేక్ చేస్తుందని బెల్లంకొండ చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   22 May 2025 12:00 PM IST
బెల్లంకొండ నెక్స్ట్.. ఇండియాని షేక్ చేసేలా ఉంటుందట!
X

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం “భైరవం” అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ వంటి టాలెంటెడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 30న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ట్రైలర్, పోస్టర్ల ద్వారా సినిమా మీద మంచి హైప్ ఏర్పడగా, బెల్లంకొండ కూడా మీడియా ఇంటరాక్షన్స్‌లో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ బజ్ పెంచుతున్నాడు.

భైరవం తమిళ హిట్ చిత్రం “గరుడన్”కి రీమేక్ అయినప్పటికీ, ఇది పూర్తిగా ఒరిజినల్ ట్రీట్మెంట్‌తో సాగుతుందని బెల్లంకొండ క్లారిటీ ఇచ్చాడు. కథలోని ప్రధాన అంశాన్ని మాత్రమే తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసినట్లు తెలిపారు. సినిమాకి సంబంధించిన అప్‌డేట్ లు, మేకింగ్ విజువల్స్ చూస్తుంటే మంచి ఆడియన్స్ కనెక్ట్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పైగా, బెల్లంకొండకు ఉన్న హిందీ డబ్బింగ్ మార్కెట్ వల్ల ఈ సినిమాకి బిజినెస్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ సందర్బంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పిన వివరాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడితో రూపొందే “హైందవం” సినిమా ఇండియావంతా షేక్ చేస్తుందని బెల్లంకొండ చెప్పడం విశేషం. దశావతారాల చుట్టూ నడిచే ఈ సినిమా గత మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్‌లో ఉందని, ప్రీ విజువలైజేషన్ దశలోనే సినిమాకి పెద్ద స్కేల్ ఉందని వెల్లడించాడు.

ఇది తన కెరీర్‌కు గేమ్ ఛేంజర్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ అతని మాటల్లో కనిపించింది. ఈవెంట్ సినిమాల తరహాలో ఉండబోతున్న “హైందవం” ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో బెల్లంకొండ ఇప్పటికే పూర్తి చేసిన టైసన్ నాయుడు, కిష్కింధపుర లాంటి సినిమాలు కూడా కంటెంట్ పరంగా స్ట్రాంగ్‌గా వచ్చాయని అన్నారు. వాటి ఔట్‌పుట్ చూసి మంచి ఫలితాలు వస్తాయని ధీమాగా చెప్పాడు.

అన్ని సినిమాలకీ బిజినెస్ బాగా జరుగుతోందని, తనకున్న హిందీ ఫాలోయింగ్ వల్ల డబ్బింగ్ హక్కులకు భారీ రేట్లు వస్తున్నాయని తెలిపాడు. అన్నింటికన్నా హైందవం విషయంలో మాత్రం ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. ఇక మే 30న విడుదలవుతున్న “భైరవం” బెల్లంకొండ కెరీర్‌లో కీలక చిత్రంగా నిలవనుంది. ఇందులోని మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ నేరేషన్, ఇతర స్టార్స్ ప్రెజెంటేషన్ సినిమాను కొత్తగా పరిచయం చేయనున్నాయి. ఇక బాక్సాఫీస్ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ అందుతాయో చూడాలి.