Begin typing your search above and press return to search.

బిచ్చగాడి 'రత్తం' ఇక తెలుగులో లేనట్

విజయ్ ఆంటోనీ తన కూతురు చనిపోయిన బాధ తోనే రత్తం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 8:56 AM GMT
బిచ్చగాడి రత్తం ఇక తెలుగులో లేనట్
X

తమిళ్‌ హీరో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమా తో టాలీవుడ్ లో కూడా పాపులర్ అయిన విషయం తెల్సిందే. బిచ్చగాడు సినిమా తర్వాత ఆయన చేసిన తమిళ్ సినిమాలు దాదాపు అన్ని కూడా తెలుగు లో డబ్‌ అయ్యాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా బిచ్చగాడు రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. బిచ్చగాడు 2 మాత్రం పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది.

బిచ్చగాడు 2 తో తెలుగు మార్కెట్ లో కాస్త పుంజుకున్న విజయ్ ఆంటోనీ తన రత్తం సినిమా తో రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. అక్టోబర్‌ 6న రత్తం సినిమాను తమిళ్ లో విడుదల చేయడం జరిగింది. తమిళ్‌ లో అనుకున్న సమయంకు విడుదల అయిన రత్తం ను తెలుగు లో మాత్రం విడుదల చేయడం లో విఫలం అయ్యారు.

విజయ్ ఆంటోనీ తన కూతురు చనిపోయిన బాధ తోనే రత్తం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పుట్టెడు దుఃఖం లో ఉన్న విజయ్ ఆంటోనీ రత్తం సినిమా ప్రమోషన్ లో ఎక్కువగా పాల్గొనలేక పోయాడు. తెలుగు లో రెండు మూడు వారాల తర్వాత రత్తం ను విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు రత్తంను తెలుగు లో థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్‌ చేయడం ఉత్తమం అన్నట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రత్తం సినిమాకు తమిళ్ రివ్యూవర్స్ నుండి నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా రత్తం సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన వసూళ్లు నిర్మాతను మరియు బయ్యర్లను తీవ్రంగా నిరాశ పరిచే విధంగా ఉన్నాయి. బాక్సాఫీస్ రిపోర్ట్‌ నేపథ్యం లో విజయ్ ఆంటోనీ రత్తం ను తెలుగు లో రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.

కూతురు చనిపోయిన బాధలో ఉన్న విజయ్ ఆంటోనీకి రత్తం సినిమా కొంతలో కొంత అయినా రిలాక్స్ ను ఇస్తుందని ఆయన అభిమానులు భావించారు. కానీ ఫలితం తారుమారు అవ్వడం తో కూతురు చనిపోయిన బాధ నుంచి తేరుకోకుండానే సినిమా ఫ్లాప్స్ విజయ్ ఆంటోనీకి నిరాశను మిగిల్చిందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.