Begin typing your search above and press return to search.

విజయ్ ని గట్టిగా ప్రిపేర్ చేయించిన పూరి..!

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ తో ఏ హీరో సినిమా చేస్తాడా అన్న డౌట్ మొదలైంది.

By:  Tupaki Desk   |   24 May 2025 8:45 AM IST
విజయ్ ని గట్టిగా ప్రిపేర్ చేయించిన పూరి..!
X

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ తో ఏ హీరో సినిమా చేస్తాడా అన్న డౌట్ మొదలైంది. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరోలు క్యూ కట్టే వారు కానీ ఇప్పుడు ఆ పూరీ ఏమయ్యాడో అనుకునే పరిస్థితి ఏర్పడింది. తన సినిమాలతో స్టార్ హీరోలకు ఇండస్ట్రీ రికార్డులు ఇచ్చిన డైరెక్టర్ పూరీ మరోసారి ఆడియన్స్ కు గుర్తు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పూరీ సర్ ప్రైజింగ్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

బెగ్గర్ టైటిల్ తో పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమా వస్తుంది. ఈ సినిమా లో టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది. మామూలుగా అయితే విజయ్ సేతుపతి కథ నచ్చనిది సినిమా ఓకే చేయడు. అందులోనూ పూరీ అసలు ఏమాత్రం ఫాం లో లేడు ఆయన చెప్పిన కథ నచ్చినా ఆయన ఎలా తీస్తాడు అన్న డౌట్ ఉంటుంది. కానీ ఇలాంటి డౌట్లు ఏమి లేకుండా సినిమా లాక్ చేసుకున్నాడు విజయ్ సేతుపతి. పూరీ చెప్పిన కథ ఎంత ఎగ్జైట్ చేస్తేనో ఆయన ఈ సినిమా చేసేందుకు సైన్ చేసి ఉంటారని ఆడియన్స్ భావిస్తున్నారు.

ఐతే బెగ్గర్ సినిమా విషయంలో ఒకప్పటి పూరీ వర్కింగ్ స్టైల్ ని గుర్తు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఐతే పూరీ ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాల్లా కాకుండా ఈ సినిమాను చాలా సీక్రెట్ గా తీయాలని ప్లాన్ చేశాడట. అందుకే విజయ్ సేతుపతి కూడా పూరీ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వట్లేదు.

రీసెంట్ గా తన సినిమా ఏస్ తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి పూరీ సినిమా గురించి అడిగితే ఇప్పుడేమి చెప్పలేమని అన్నాడు. అంటే పూరీ ఈసారి డిఫరెంట్ గా ఏదో ప్లాన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. బెగ్గర్ సినిమా పూరీని ఫాంలోకి తెస్తే మాత్రం తప్పకుండా ఆ క్రెడిట్ లో కొంత విజయ్ సేతుపతికి ఇచ్చేయొచ్చు. ఇంతకీ ఈ బెగ్గర్ కథ ఏంటి పూరీ ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు చేస్తాడన్నది చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న బెగ్గర్ అంచనాలను అందుకుంటే మాత్రం పూరీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా సినిమా ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని చెప్పొచ్చు.