Begin typing your search above and press return to search.

GOG కి ముందు.. ఆ తరువాత..

కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:30 PM GMT
GOG కి ముందు.. ఆ తరువాత..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు మాస్ దా కా దాస్ విశ్వక్ సేన్. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఆయన.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాల దర్శక నిర్మాణ బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు విశ్వక్.

ఫలక్ నామా దాస్ సినిమాతో రైటర్ గా కూడా మారిపోయారు విశ్వక్. కొన్ని రోజుల క్రితం, హోమ్ బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ ద్వారా ఇండస్ట్రీకి కొత్త వాళ్లను పరిచయం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా 20 మంది కొత్తవారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక రీసెంట్ గా దమ్కీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివర దశలో ఉంది. మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. అయితే ఈ మూవీపై విశ్వక్ సేన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఈ సినిమా తర్వాత విశ్వక్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరగనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెబుతున్నారు. GOG తర్వాత GOG ముందు అన్నట్లుగా విశ్వక్ కెరీర్ ఉండనుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ మూవీతో విశ్వక్ సేన్ సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పక్కా మాస్ రోల్ లో విశ్వక్ ను చూసేందుకు ఆతృతగా ఉందని అంటున్నారు.

కెరీర్ లో కంప్లీట్ మాస్ గెటప్ లో విశ్వక్ సేన్ నటించిన తొలి మూవీ ఇదే. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ చాలా బాగా ఆలోచిస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద సోలో రిలీజ్ డేట్ కోసం సెర్చ్ చేస్తున్నారట. మంచి సినిమాను మంచి రోజే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ మూవీతో విశ్వక్ ఎంతటి హిట్ కొడతారో చూడాలి.