Begin typing your search above and press return to search.

బేబమ్మ అలా చేస్తానన్నా ఛాన్స్ ఇవ్వట్లేదా..!

మొదటి సినిమా నుంచి ఏడు ఎనిమిది సినిమాల తర్వాత చూస్తే అప్పటికే ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 5:30 AM GMT
బేబమ్మ అలా చేస్తానన్నా ఛాన్స్ ఇవ్వట్లేదా..!
X

అంతకుముందు మోడల్ గా చేసిన కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే పాత్ర పేరు పెట్టి పిలిచే రేంజ్ అందుకుంది. ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ పడితే కెరీర్ జెట్ స్పీడ్ లో వెళ్తుంది. అలానే బేబమ్మకి కూడా వరుసగా అరడజను ఛాన్స్ లు వచ్చాయి. అవకాశాలు వస్తే కాదంటే ఎలా అనుకుని వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వెళ్లింది. అయితే వాటిలో హిట్ అయిన సినిమాల కన్నా ఫ్లాప్ అయినవే ఎక్కువ ఉన్నాయి. మొదటి సినిమా నుంచి ఏడు ఎనిమిది సినిమాల తర్వాత చూస్తే అప్పటికే ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది.

హీరోయిన్స్ కెరీర్ వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటాయన్నది ఎంత నిజమే ఎంతో కొంత లక్ మీద కూడా డిపెండ్ అవుతాయన్నది కూడా నిజం. ఈ క్రమంలో బేబమ్మ కి ఈమధ్య బ్యాడ్ లక్ కొనసాగుతుంది. తను ఏం చేసినా సరే అది వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఇక పరిశ్రమలో హిట్ వస్తే ఎలా ఎంకరేజ్ చేస్తారో ఫ్లాప్ వస్తె అంతే దూరం పెడతారు. ప్రస్తుతం మంగుళూరి భామ పరిస్థితి అదే అయ్యింది.

కృతి శెట్టి కి అవకాశాలు లేక ఖాళీగా ఉంది. ప్రస్తుతం అమ్మడు శర్వానంద్ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఆఫర్ ఒక్కటి కూడా లేదు. అవకాశాల కోసం ఈమధ్య గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటో షూట్ కూడా చేస్తుంది బేబమ్మ. తను ఇక మీదట గ్లామర్ పాత్రలకు ఓకే అని హింట్ ఇస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు.

తన మేనేజర్ తో రెమ్యునరేషన్ కూడా అటు ఇటుగా తీసుకుందాం ముందు సినిమాలు దక్కించుకోవాలని అంటుందట. ఉప్పెన హిట్ ఆ తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు ఇలా 3 హిట్లు పడగానే కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన కృతి శెట్టి ఇప్పుడు ఆ రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోవట్లేదట. ముందు ఆఫర్ ఇవ్వండి పారితోషికం మీరు ఎంత ఇచ్చినా ఓకే అనే పరిస్థితి ఏర్పడిందట.

అందుకే తెలుగులో కన్నా ఇతర భాషల మీద ఫోకస్ చేస్తే బెటర్ అని తమిళ, మలయాళ పరిశ్రమల వైపు వెళ్లింది. కోలీవుడ్ లో జయం రవితో ఒక సినిమా చేస్తున్న కృతి శెట్టి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ రెండు హిట్ పడితే అక్కడ కృతి తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.