Begin typing your search above and press return to search.

బ్యూటీ ట్యాలెంట్ రీల్ కి ఫిదా!

దీంతో డాన్స్ ప‌రంగా ఎంత‌లా రాటు దేలింది అన‌డానికి ఈ వీడియో చూస్తే చాల‌దా? అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 2:59 PM GMT
బ్యూటీ ట్యాలెంట్  రీల్ కి ఫిదా!
X

అవ్ నీత్ కౌర్ ట్రెండింగ్ లోఉన్న పేరు ఇది. న‌ట‌న‌తో స‌త్తా చాటుతుంది. కుర్ర‌కారు గుండెల్లో ల‌య‌లు మ్రోగించ‌డంలోనూ అమ్మ‌డు ముందుంటుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఫేమ‌స్ అయిన బ్యూటీ. కానీ ఈ బ్యూటీ డాన్సింగ్ స్కిల్స్ గురించి తెలిసింది మాత్రం చాలా త‌క్కువ మందికే. అమ్మ‌డు టీవీ రంగం నుంచి సినిమాల‌కు ప్ర‌మోట్ అయిన బ్యూటీ. దీంతో డాన్స్ ప‌రంగా ఎంత‌లా రాటు దేలింది అన‌డానికి ఈ వీడియో చూస్తే చాల‌దా? అనిపిస్తుంది.

అమ్మ‌డు ఇంత గొప్ప డాన్స‌ర్ అని స‌ర్ ప్రైజ్ అవ్వ‌డం ఖాయం. ఇదిగో ఇక్క‌డిలా రూమ్ లో డాన్స్ చేసిన వీడియో ఒక‌టి వ‌దిలింది. అమ్మ‌డు త‌న‌దైన మార్క్ స్పెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. అవ్ నీత్ హుక్ స్టెప్.. షోల్డ‌ర్ మూవ్ మెంట్స్ చూస్తే అమె ఇంత గొప్ప డాన్సరా? అని అంతా ముక్కున వేలేసుకుంటారు. అమ్మ‌డి ట్యాలెంట్ నిప్రూవ్ చేస్తూ చేసిన రీల్ ఇది. ఓ బాలీవుడ్ సాంగ్ కి డాన్సు చేస్తూ ఇలా చిక్కింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అవ‌నీత్ పెర్పార్మెన్స్ కి అంతా ఫిదా అవుతుతున్నారు.

అవ్నీత్ కౌర్ మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లో హాట్‌గా ద‌ర్శ‌నిమ‌వ్వ‌డంలోనూ ముందుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల ని హీటెక్కిస్తుంది. ఆర‌కంగానూ నెట్టింట బాగా పాపుల‌ర్ అయింది. ఒక‌సారి పాస్ట్ లైఫ్ లోకి వెళ్తే... అవనీత్ కౌర్ హిందీ టెలివిజన్ రంగం నుంచి సినిమాల్లోకి వ‌చ్చింది. మర్దానీలో మీరా పాత్ర‌తో టికు వెడ్స్ షేరులో టికు పాత్రలతో బాగా పాపుల‌రైంది.

చంద్ర నందినిలో చారుమతి..అలాద్దీన్‌లో యాస్మిన్ - నామ్ తో సునా హోగా చిత్రాలతోనే ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. జీ టీవీ డ్యాన్స్ షో డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్‌తో కెరీర్ ప్రారంభించింది. తాజా రీల్ గ‌నుక టాప్ మేక‌ర్స్...బాలీవుడ్ బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్స్ దృష్టిలో ప‌డితే గ‌నుక అమ్మ‌డికి మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ రీల్ వెనుక అవ‌నీత్ ప్లాన్ కూడా అదే అయి ఉండొచ్చు.