Begin typing your search above and press return to search.

మారుతి బ్యూటీ.. వ్వాటే కలర్ఫుల్ లవ్

ఇప్పుడు మారుతి నిర్మాతగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యూటీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా వచ్చింది.

By:  Tupaki Desk   |   22 April 2024 8:13 AM GMT
మారుతి బ్యూటీ.. వ్వాటే కలర్ఫుల్ లవ్
X

టాలీవుడ్ లో చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ కొట్టే డైరెక్టర్ గా మారుతికి మంచి పేరు ఉందన్న విషయం తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మారుతి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజా సాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.

అయితే గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు మారుతి నిర్మాతగా వ్యవహరించారు. గత ఏడాది చిన్న మూవీగా విడుదలైన బేబీ సినిమా భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న బేబీ మూవీ.. నటీనటులు వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ తోపాటు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి కూడా ఒకరు.

ఇప్పుడు మారుతి నిర్మాతగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యూటీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ రీసెంట్ గా వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బ్యూటీ మూవీ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టర్ లో ఇద్దరు ప్రేమికులు మేఘాలపై కూర్చున్నట్లు చూపించారు మేకర్స్. ఎదురుగా లవ్ సింబల్ షేప్ లో పెద్ద మేఘం ఉంది. కింద సముద్రం, పైన ఆకాశం.. మొత్తంగా పోస్టర్ అంతా రొమాంటిక్ గా కనిపిస్తోంది. సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. నెటిజన్లు.. మారుతికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరో బేబీ లాంటి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. బేబీ జోనర్ లోనే బ్యూటీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

బ్యూటీ సినిమాతో బాల సుబ్రహ్మణ్యం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అంకిత్ కొయ్య, విశాఖ ధీమాన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతమంది యువ నిర్మాతలతో కలిసి మారుతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గేనిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మరి బ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.