Begin typing your search above and press return to search.

వీడియో: స్క‌ర్టులో అందాల‌ను వేడిగా వ‌డ్డిస్తోంది

నిఖిత నిరంత‌రం త‌న కుటుంబ స‌భ్యుల‌తో లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 12:30 AM GMT
వీడియో: స్క‌ర్టులో అందాల‌ను వేడిగా వ‌డ్డిస్తోంది
X

ఫేమ‌స్ మోటివేష‌న్ స్పీక‌ర్, వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు, టీవీ న‌టి నిఖితా శ‌ర్మకు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో ఈ భామ ఎంతో స్పీడ్ గా ఉంది. నిఖిత నిరంత‌రం త‌న కుటుంబ స‌భ్యుల‌తో లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తోంది.

నిఖిత సామాజిక మాధ్య‌మాల్లో అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టీవీ న‌టి నికితాశ‌ర్మ డేరింగ్ అండ్ గ‌ట్సీ ఫీట్ ఎప్పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. తాజాగా నిఖిత త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ఉన్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఓపెన్ టాప్ స్క‌ర్ట్ లో నిఖిత చాలా స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు దీనిపై స్పందిస్తున్నారు. ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను కొంద‌రు షేర్ చేస్తున్నారు.

నిఖిత శ‌ర్మ వివ‌రాల్లోకి వెళితే... ఈ బ్యూటీ నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్క‌డే పుట్టి పెరిగింది. మోటివేష‌న్ స్పీక‌ర్ గా ఇంత‌కుముందు ఫేమ‌స్ అయ్యింది. ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డులు రివార్డులు ద‌క్కించుకుంది. అటుపై క‌థానాయిక‌గా ఎద‌గాలని భావించింది. ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి ప్ర‌వేశించింది. కానీ సినిమా అవ‌కాశాలు రాలేదు. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏద‌ర్శ‌క నిర్మాత ఎంక‌రేజ్ చేయ‌లేదు. దీంతో బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. చాలా సీరియ‌ళ్లు..షోల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై యాక్టివ్ గానే ఉంది.

సినిమాల్లో అవ‌కాశాలు కోసం ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో నిఖితా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. నిఖిత ఇన్ స్టాలో ఎంతో జోవియ‌ల్ గా ఉండే ఫోటోగ్రాఫ్స్ వీడియోల‌కు కొద‌వేమీ లేదు. అందుకే నిఖితా పాలోవ‌ర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది.