Begin typing your search above and press return to search.

బ్లాక్‌ లో బ్యూటీ... దెయ్యం అన్నా పర్వాలేదు

రెగ్యులర్ గా శృతి హాసన్ తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 5:11 AM GMT
బ్లాక్‌ లో బ్యూటీ... దెయ్యం అన్నా పర్వాలేదు
X

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్‌ నట వారసురాలు శృతి హాసన్‌ పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలో ఆమె సందడి అంతా ఇంతా కాదు. రెగ్యులర్ గా శృతి హాసన్ తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. శృతి హాసన్ ఎక్కువగా బ్లాక్ కలర్‌ లో కనిపిస్తూ ఉంటుంది.

శృతి హాసన్ ఎక్కువ సార్లు బ్లాక్ డ్రెస్ లో మెటల్ ఆర్నమెంట్స్ తో కనిపించింది. దాంతో చాలా మంది కూడా సోషల్‌ మీడియాలో శృతి హాసన్‌ బ్లాక్ డ్రెస్ లో దెయ్యం మాదిరిగా ఉందని కామెంట్స్ చేశారు. బ్లాక్ మేకప్‌ తో కూడా పలు సార్లు సోషల్‌ మీడియాలో శృతి హాసన్ కనిపించింది.

తాజాగా శృతి హాసన్ ఆ విషయమై స్పందించింది. నేను ఒక నటిని. నాకు పొగడ్తలతో పాటు అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను విమర్శలకు ఎప్పుడు కూడా బాధ పడను. వాటిని కూడా నేను ప్రశంసలు గానే స్వీకరిస్తాను అంది. విమర్శలు, ప్రశంసలు ఒకే విధంగా స్వీకరిస్తాను అంది.

నాకు బ్లాక్‌ డ్రెస్ మరియు మెటల్‌ ఆర్నమెంట్స్ ధరించడం ఇష్టం. నా ఇష్ట ప్రకారం నా ఔట్‌ ఫిట్ ను డిజైన్ చేయించుకుంటాను. విమర్శలకు భయపడి నేను ఏమీ ఆందోళన చెందను. ఒక వేళ నన్ను బ్లాక్ డ్రెస్ లో చూసిన వాళ్లు దెయ్యం అన్నా నేను పట్టించుకోను అని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. నన్ను నేను బ్లాక్ డ్రెస్ లో అద్దం లో చూసుకున్న సమయంలో చాలా సంతోషంగా అనిపిస్తుందని పేర్కొంది.

తాజాగా సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి హాసన్‌ ప్రస్తుతం తెలుగు తో పాటు హిందీ సినిమాల్లో వరుసగా నటిస్తోంది. తాజాగా తమిళంలో ఒక బయోపిక్ ను చేసేందుకు రెడీ అయ్యింది. ఆ లేడీ ఓరియంటెడ్‌ మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.