Begin typing your search above and press return to search.

వందల కోట్లు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు: బ్యూటీ నిర్మాత

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వందల కోట్లు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు.

By:  Tupaki Desk   |   14 Sept 2025 6:15 PM IST
వందల కోట్లు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు: బ్యూటీ నిర్మాత
X

సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమైన బ్యూటీ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించగా, విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వందల కోట్లు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు. మంచి సినిమాలు నిర్మించాలని మాత్రమే వానరా సెల్యూలాయిడ్‌ని ప్రారంభించాను. ప్రమోషన్ అనేది సముద్రం లాంటిది. ఒక మంచి సినిమా చేశాను. ఇంతకుముందు చేసిన సినిమా కూడా మంచి కంటెంట్‌తోనే వచ్చింది. ఇక ఈసారి ‘బ్యూటీ’తో మేము మరో స్థాయికి చేరుకున్నాం” అని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, “ఇంతకుముందు నిర్మించిన సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు దాని విలువ అందరికీ అర్థమైంది. ఈసారి మాత్రం థియేటర్లలోనే ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ‘బ్యూటీ’ కథ విన్న వెంటనే నచ్చింది. వర్దన్ గారు చేసిన మార్పులు, చేర్పులు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రాముఖ్యముంది. నరేష్ గారు, వాసుకి గారు, అంకిత్, నీలఖి అందరూ అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు ఎవరూ నిరాశ చెందరు” అని చెప్పారు.

“ఆర్.వి. సుబ్రహ్మణ్యం గారు రాసిన కథ మాకు బలంగా అనిపించింది. వర్దన్ గారు దాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకి హృదయం లాంటిది. ప్రతి పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బలన్నిచ్చాయి” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, “ఈ సినిమాకు అండగా నిలిచిన మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తారు. అలాగే మా టీమ్‌కి మద్దతు ఇచ్చిన ఎస్‌కేఎన్ గారికి కూడా కృతజ్ఞతలు. సెప్టెంబర్ 19న విడుదలయ్యే బ్యూటీ సినిమాని ప్రేక్షకులు తప్పక థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం” అని నిర్మాత అన్నారు. మొత్తానికి, నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాటల్లో బ్యూటీ వెనుక ఉన్న నిజమైన ప్యాషన్, మంచి సినిమాలు చేయాలనే సంకల్పం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఆడియెన్స్ కి ఈ సినిమా ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.