Begin typing your search above and press return to search.

పెళ్లెన కొత్త‌లోనే పేంప‌ర్ చేసిన బ్యూటీలు!

ర్యాంప్ వాక్ లో డిజైన‌ర్ దుస్తుల్లో వాక్ చేసే క్ర‌మంలో అవ‌సరం మేర అందాల ఆర‌బోత హైలైట్ అవుతుంది. అటుపై సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పాత్ర‌ల్ని బ‌ట్టి ఎలా ఉండాలి

By:  Tupaki Desk   |   2 April 2024 11:30 AM GMT
పెళ్లెన కొత్త‌లోనే పేంప‌ర్ చేసిన బ్యూటీలు!
X

గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో హీరోయిన్లు అంతే గ్లామ‌ర్ గా..బోల్డ్ గా క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. మోడ‌లింగ్ నుంచే చిట్టిపొట్టి దుస్తులు అల‌వాటవుతాయి. ర్యాంప్ వాక్ లో డిజైన‌ర్ దుస్తుల్లో వాక్ చేసే క్ర‌మంలో అవ‌సరం మేర అందాల ఆర‌బోత హైలైట్ అవుతుంది. అటుపై సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పాత్ర‌ల్ని బ‌ట్టి ఎలా ఉండాలి? ఎలా క‌నిపించాలి? అన్న‌ది డిసైడ్ అవుతుంది. ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ భామ ఈ రూల్ క‌చ్చితంగా పాటిస్తుంది. లేదంటే ఇక్క‌డ అవ‌కాశాలు రావు అన్న‌ది అంతే వాస్త‌వం.

పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు త‌మ‌ని తాము మౌల్డ్ చేసుకుంటూ జ‌ర్నీ చేయాల్సిన ప‌రిశ్ర‌మ కాబ‌ట్టి వాళ్లు ఆ రూల్స్ ని అంతే విధిగా పాటిస్తుంటారు. ఇక సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక కాంపిటీష‌న్ పెర‌గ‌డంతో గ్లామ‌ర్ గేట్లు ఏ రేంజ్ లో తెరుస్తున్నారో క‌నిపిస్తూనే ఉంది. అయితే ఇదంతా వావాహానికి ముందు ఎంతో స్వేచ్ఛ‌గా చేయ‌గ‌ల‌రు. కానీ వివాహం త‌ర్వాత కూడా అంతే స్వేచ్ఛ మాకుంద‌ని నిరూపించిన హీరోయిన్లు లేక‌పోలేదు.

చాలా మంది భామ‌లు వృత్తిని-వ్య‌క్తిగత జీవితాన్ని వేరు చేసి మాట్లాడినా ఆ వేరియేష‌న్ మాత్రం కొన్ని చోట్ల క‌నిపిం చ‌లేదు అన్న విమ‌ర్శ చాలా కాలంగా ఉంది. తాజాగా ఈ మ‌ధ్య‌నే పెళ్లి చేసుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాహం త‌ర్వాత అమ్మ‌డి చిట్టిపొట్టి దుస్తుల్లో స్కిన్ షో చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. పెళ్లైన త‌ర్వాత కూడా ఈ హాట్ షో ఏంటి? అందులోనూ ఆఫ్ ది స్క్రీన్ లో ఏంటి? అనే విమ‌ర్శ తెరపైకి వ‌చ్చింది. భార‌త సంప్ర‌దాయ క‌ట్టుబాట్లు ఎటు పోతున్నాయంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత‌కుముందు ఇదే త‌ర‌హాలో స‌మంత కూడా వ్య‌వ‌హ‌రించింది అన్న విష‌యం గుర్తు చేస్తున్నారు. నాగ‌చైత‌న్య‌తో వివాహ‌మైన త‌ర్వాత వెకేష‌న్ లో భాగంగా అమ్మ‌డు లో దుస్తుల్లో షేర్ చేసిన ఫోటోలు అప్ప‌ట్లో పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఆ త‌ర్వాత న‌య‌న‌తార విగ్నేష్ శివ‌న్ ని వివాహం చేసుకున్న అనంత‌రం వెకేష‌న్ లో భాగంగా బెడ్ రూమ్ కే ప‌రిమిత‌వ్వాల్సిన ఫోటోలు ప‌బ్లిక్ ఫాట్ ఫాంలో కి రావ‌డంతో అప్పుడే అవే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇక భార‌తీయ న‌టి..అమెరికా కోడలు అయిన ప్రియాంక చోప్రా గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. హాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత అమ్మ‌డు పంథా పూర్తిగా మార్చేసి అక్క‌డ క‌ల్చ‌ర్ లో క‌నిపించ‌డంపై ఇప్ప‌టికీ విమర్శ‌లు ఎదుర్కుంటూనే ఉంది.