Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్ ఫోటో: బ్యాట్‌మేన్ (Vs) వండ‌ర్ ఉమెన్

తాజాగా గాల్ గాడోట్ ఒక రేర్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. ఇది త్రోబ్యాక్ ఫోటో. బ్యాట్ మేన్ V సూపర్‌మ్యాన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నాన‌ని గాల్ గాడోట్ తెలిపింది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 1:30 AM GMT
త్రోబ్యాక్ ఫోటో: బ్యాట్‌మేన్ (Vs) వండ‌ర్ ఉమెన్
X

'వండ‌ర్ ఉమెన్' సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప పాలోయింగ్ సంపాదించుకుంది గాల్ గాడోట్ (38). ఇటీవ‌లే 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రంతో త‌న అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోయినా గాల్ గాడోట్ న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. అయితే గాల్ గాడోట్ 'హార్ట్ ఆఫ్ స్టోన్' ఫైట్స్ చిత్రీకర‌ణ సమ‌యంలో తనకు అయిన‌ గాయాల గురించి వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'హార్ట్ ఆప్ స్టోన్' కోసం పోరాట సన్నివేశాలను చిత్రీకరించిన స‌మ‌యంలో తన మెడ నొప్పితో పాటు, వెనుక భాగంలో నాలుగు డిస్క్‌లు జారాయని గాల్ గాడోట్ వెల్లడించింది. గాల్ కు ముగ్గురు కుమార్తెలు అల్మా (12), మాయ, ఆరు అండ్ డేనియెల్లా ట్విన్స్ ఉన్నారు. జారోన్ వర్సనో జోయా భ‌ర్త‌. ఇటీవ‌లి గాయాల వ‌ల్ల తాను విచిత్రమైన రూపాన్ని పొందాన‌ని కూడా అంగీకరించింది.


నిజానికి గాల్ ద‌శాబ్ధ కాలం పైగా భారీ యాక్ష‌న్ చిత్రాల్లో న‌టిస్తూనే ఉంది. సినిమాల్లో తన స్వంత స్టంట్‌లను ప్రదర్శించింది. పోరాట సన్నివేశాలను చేయడంలో ఎల్ల‌పుడూ ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ అత్యుత్సాహ‌మే గాయాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. గాల్ ఇటీవ‌ల‌ ది సన్ మ్యాగ‌జైన్‌తో మాట్లాడుతూ ...నాకు పుష్కలంగా గాయాలు ఉన్నాయ‌ని, ఒక ఆదివారం నేను లండన్‌లోని పార్క్‌లో అమ్మాయిలతో నడుస్తుంటే ఎవరో నన్ను వింతగా చూశారని కూడా తెలిపింది. అప్పుడు నేను వేసవి దుస్తులను ధరించాను. ఆ స‌మ‌యంలో నా కాళ్ళు, వీపు పూర్తిగా గాయపడిన సంగతిని పట్టించుకోలేదు. నేను నా కూతుళ్లతో ఉన్నాను. ప్రజలు నన్ను ఏదో ఆఫ్ చేసినట్లుగా చూస్తున్నారు. కానీ భారీ యాక్ష‌న్ పాత్రల వల్ల నాకు చాలా గాయాలు కావడం అనివార్యం. నాకు రెండు మెడ హెర్నియేషన్లు .. రెండు బ్యాక్ హెర్నియేషన్లు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఇది ఉద్యోగంలో భాగం.. అని పేర్కొంది. సినిమాలు చేయడంలో నాకు న‌చ్చేవి, నచ్చనివి ఉంటాయి. ఫైట్ చేయడం - హ్యాండ్ ఆన్ హ్యాండ్ కంబాట్ చేయడం, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.. అని తెలిపింది. నిజానికి పోరాటాన్ని డ్యాన్స్‌తో పోల్చింది. తన శరీరాన్ని ఉపయోగించి తనను తాను వ్యక్తీకరించగల‌న‌ని వివరించింది. పోరాట సన్నివేశాలు "నిజంగా నియంత్రణలో ఉన్నట్లు భావిస్తున్నప్పుడు మనం చేసే ఒక పని" అని తెలిపింది.

2004లో మిస్ ఇజ్రాయెల్ కిరీటం పొందిన తర్వాత, గాల్ లాయర్ స్ట‌డీస్ పూర్తి చేయ‌డానికి ముందు ఇజ్రాయేట్ (స్వ‌)దేశంలో రెండు సంవత్సరాల తప్పనిసరి సైనిక సేవను పూర్తి చేసింది. మరోవైపు మోడలింగ్ లోను రాణించింది. 2009లో ఫాస్ట్ & ఫ్యూరియస్‌లో యాక్షన్ గర్ల్ గిసెల్ యాషర్‌గా నటించినప్పుడు గాల్ లోని ఫైటింగ్ స్కిల్స్ మొదటిసారిగా తెరపై కనిపించాయి. 2011 ఇన్‌స్టాల్‌మెంట్ 'ఫాస్ట్ ఫైవ్‌', 2013లో ఫాస్ట్ & ఫ్యూరియస్ 6 కోసం తన స్వంత స్టంట్‌లను ప్రదర్శించింది. వండ‌ర్ ఉమెన్, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాల్లోను అద్భుత పోరాట దృశ్యాలతో అల‌రించింది.

అదిరిపోయే ఫోజిచ్చిన గాల్ గాడోట్

తాజాగా గాల్ గాడోట్ ఒక రేర్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. ఇది త్రోబ్యాక్ ఫోటో. బ్యాట్ మేన్ V సూపర్‌మ్యాన్ కోసం ఫోటోషూట్‌లో పాల్గొన్నాన‌ని గాల్ గాడోట్ తెలిపింది. గాల్ పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్ బెన్ అఫ్లెక్ కలిసి పోజులిచ్చారు!!! "నేను ఈ ఫోటోగ్రాఫ్ ని నిజంగా ప్రేమిస్తున్నాను" అని గాల్ గాడోట్ వెల్ల‌డించింది. ఫ్యాన్స్ దీనిపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. నిజానికి యానిమేటెడ్ జస్టిస్ లీగ్‌లో చూసినట్లుగా శృంగారభరితమైన బ్యాట్‌మ్యాన్ - వండర్ ఉమెన్ ఫిల్మ్‌ని చూడాలనుకుంటున్నాను.. అని ఒక అభిమాని ఈ ఫోటోపై కామెంట్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ స్టైలిష్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.