Begin typing your search above and press return to search.

రజాకర్.. వెండితెరపైకి మరో యోధుడి కథ!

మన దేశాన్ని బ్రిటీష్ వారు పాలించగా వారి నుంచి స్వతంత్రం రావడం కోసం మన వాళ్లు చాలా మంది పోరాడారు

By:  Tupaki Desk   |   11 Aug 2023 12:14 PM GMT
రజాకర్.. వెండితెరపైకి మరో యోధుడి కథ!
X

మన దేశాన్ని బ్రిటీష్ వారు పాలించగా వారి నుంచి స్వతంత్రం రావడం కోసం మన వాళ్లు చాలా మంది పోరాడారు. ఇప్పుడు మనం చాలా మంది స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటున్నాం. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రజాకార్లు పెత్తనం చేశారు. ఆ రజాకార్లపై కూడా పోరాడిన వారు ఉన్నారు. అలా వారిపై పోరాడి ప్రాణ త్యాగం చేసిన వారు చాలా తక్కువ మందిని మనం తలుచుకుంటున్నాం. వారిలో బత్తిని మొగిలయ్య గౌడ్ ఒకరు.

నిజాం రజాకార్ల నుంచి ఎదిరించి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి బత్తిని మొగిలయ్య గౌడ్. కాగా, ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం రజాకర్. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మూవీ టీమ్ ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో మొగిలయ్య పాత్ర ధారి జాతీయ జెండా కు సెల్యూట్ చేస్తూ ఉన్నాడు. వెనక నుంచి రజాకర్లు తుపాకీలు ఆయనకు ఎక్కు పెట్టినట్లుగా ఈ పోస్టర్ ఉంది.

కాగా, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ని హైదరాబాద్‌లో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదిరలు ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో ఈ సినిమాను తీయడం విశేషం.

అయితే, ఈ మూవీ పోస్టర్ విడుదల చేసిన సమయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా ముస్లింల మత పెద్దలు ఈ సినిమాపై మండిపడుతున్నారు. కావాలనే రజాకర్లను నరహంతకులుగా చూపిస్తున్నారని సీరియస్ అవుతున్నారు.1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు.

ఇక, ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీర్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.