పరభాషా నటుడికి తెలుగులో మంచి పాపులారిటీ
సరిగ్గా ఆ టైమ్ లోనే బాసిల్ జోసెఫ్ రంగంలోకి దిగి తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. మలయాళ హీరోగా బాసిల్ జోసెఫ్ కు తెలుగులో నెక్ట్స్ లెవెల్ క్రేజే ఉంది.
By: Tupaki Desk | 21 May 2025 4:28 AMకరోనా కాలంలో థియేటర్లు లేకపోవడంతో తెలుగు ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలనూ చూశారు. ఓటీటీ బాగా పుంజుకుంది కూడా అప్పుడే. ఆ టైమ్ లో అన్ని ఇండస్ట్రీల్లోకెల్లా ఎక్కువ లాభపడిన ఇండస్ట్రీ అంటే మలయాళ ఇండస్ట్రీనే. మాలీవుడ్ ఎంతో కాలంగా మంచి సినిమాలు తీస్తున్నప్పటికీ ఆ ఇండస్ట్రీకి దేశ వ్యాప్తంగా పేరొచ్చింది మాత్రం కరోనా పాండమిక్ తర్వాతే.
మలయాళ సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో అక్కడి హీరోలు కొందరికి వేరే భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలా మలయాళ హీరోలకు కొందరికి తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. వారిలో ముందు చెప్పుకోవాల్సింది టొవినో థామస్. ఓటీటీ సినిమాలతోనే టొవినోకి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది.
2018, ఏఆర్ఎం సినిమాలకు థియేటర్లలో కూడా మంచి ఆదరణ రావడానికి టొవినోకి ఓటీటీ ద్వారా వచ్చిన ఫాలోయింగ్, క్రేజే కారణం. కానీ ఈ మధ్య టొవినో క్రేజ్, మార్కెట్ కాస్త తగ్గింది. సరిగ్గా ఆ టైమ్ లోనే బాసిల్ జోసెఫ్ రంగంలోకి దిగి తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. మలయాళ హీరోగా బాసిల్ జోసెఫ్ కు తెలుగులో నెక్ట్స్ లెవెల్ క్రేజే ఉంది.
అతను నటించిన జయ జయ జయహే, నూనాక్కుళి, సూక్ష్మదర్శిని, గురువాయూర్ అంబలనదాయిల్, ప్రవిన్‌కుడు షాపు సినిమాలతో పాటూ రీసెంట్ గా వచ్చిన పొన్ మ్యాన్ బాసిల్ ఫాలోయింగ్ ను తెలుగులో మరింత పెంచింది. ఇప్పుడు తాజాగా బాసిల్ నటించిన మరణ మాస్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాడు. బాసిల్ చేస్తున్న సినిమాలు, తన నటన తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చుతున్నాయి.
బాసిల్ సినిమా వస్తుందంటే తెలుగు ఆడియన్స్ ఎగబడి చూడ్డానికి రెడీ అయిపోతున్నారు. అతను చేశాడంటే సినిమాలో ఏదో మంచి కంటెంట్ ఉండే ఉంటుందని మనోళ్లు ఫిక్స్ అయిపోయారు. కేవలం కామెడీ పాత్రలే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా బాసిల్ భలే ఒదిగిపోతున్నాడు. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన ప్రతీ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకున్నదే. ఒక్కమాటలో చెప్పాలంటే బాసిల్ ను తెలుగు ఓటీటీలో ఎదిగిన మలయాళ హీరోగా చెప్పొచ్చు. బాసిల్ జోసెఫ్ మంచి యాక్టరే కాదు అతను డైరెక్టర్ గా ఇప్పటివరకు తన నుంచి మూడు సినిమాలు కూడా వచ్చాయి. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ బాసిల్ సొంత భాషతో పాటూ వేరే భాషలో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం విశేషం.