Begin typing your search above and press return to search.

ప్రభాస్‌, మారుతి సినిమాలో 'బాషా' రేంజ్‌...!

ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలను దర్శకుడు కానీ మేకర్స్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 2:30 PM GMT
ప్రభాస్‌, మారుతి సినిమాలో బాషా రేంజ్‌...!
X

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా కూడా భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. సాహో, రాధేశ్యామ్‌ మరియు ఆదిపురుష్ సినిమా లు ఏ రేంజ్‌ లో విడుదల అయ్యాయో తెల్సిందే. అదే స్థాయిలో సలార్ మరియు ప్రాజెక్ట్‌ కే 'కల్కి' సినిమా కూడా విడుదల అవ్వబోతున్నాయి.

ఇంత భారీ బడ్జెట్‌ మరియు యాక్షన్‌ సన్నివేశాల సినిమాల మధ్య మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ తో మారుతి సినిమా ఏంటో అంటూ చాలా మంది మొదట పెదవి విరిచారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా మారుతి దర్శకత్వంలో సినిమా వద్దు అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేసిన విషయం కూడా తెల్సిందే. ఎవరు వద్దన్నా కాదన్నా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా మొదలు అయ్యి సగం వరకు షూటింగ్ పూర్తి అయింది.

ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలను దర్శకుడు కానీ మేకర్స్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అసలు సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. అయినా కూడా సినిమా గురించి వారం వారం ఏదో ఒక పుకారు వచ్చి అంచనాలు భారీగా పెంచుతూ ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాలో ఉండే ఫ్లాష్‌ బ్యాక్‌ సన్నివేశాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభాస్‌ లుక్‌ ఫ్లాష్ బ్యాక్ లో వైల్డ్‌ గా ఉండబోతుందని.. అంతే కాకుండా సినిమా మొత్తం కూడా కామెడీ జోనర్ లో సాగగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ మాత్రమే వైల్డ్‌ యాక్షన్‌ సన్నివేశాలతో ఉంటుందని తెలుస్తోంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ లో కనిపించే ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతారని కూడా అంటున్నారు.

మొత్తానికి సినిమా ను ఎప్పుడు పూర్తి చేసి మారుతి విడుదల చేస్తాడో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్‌ బాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ ఉంటుందనే ప్రచారం చేయడంతో మరింతగా సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది లో ద్వితీయార్థం లో ఏ సమయంలో అయినా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.