పవర్‌ఫుల్ లేడీ నిర్మాత నన్ను పగబట్టింది.. నటి ఆవేదన
అదే క్రమంలో టీవీ ఇండస్ట్రీలోని అతి పెద్ద నిర్మాత, పవర్ ఫుల్ లేడీ ఫిలింమేకర్ తో గొడవపడింది.
By: Tupaki Desk | 1 April 2025 3:00 AM ISTఇంట్లో గొడవపడి ముంబైకి పారిపోయి వచ్చే చాలామంది నటీమణుల కథల్లో ఇది ఒకటి. ఆమె ఇంట్లో పెద్దవాళ్లతో గొడవ పడింది. నేనేంటో చూపిస్తాను! అని 22 ఏళ్ల వయసులో సవాల్ విసిరింది. ముంబైకి పారిపోయి వచ్చి ఇక్కడ నటనా రంగంలో ప్రయత్నాలు ప్రారంభించింది. అదే క్రమంలో టీవీ ఇండస్ట్రీలోని అతి పెద్ద నిర్మాత, పవర్ ఫుల్ లేడీ ఫిలింమేకర్ తో గొడవపడింది. ఆ గొడవ చినికి చినికి గాలివానై, కోర్టు కేసుల వరకూ దారి తీసింది.
దీంతో ఇంట్లో చెప్పలేక.. ఉన్న వృత్తిని వదిలేసి తిరిగి వెళ్లలేక ఈ నటి చాలా సతమతమైంది. కానీ దైవశక్తి తన వెంట ఉంది. ఆ అగ్ర నిర్మాత ఏడాది పాటు కోర్టులు కేసులు అంటూ తనను తిప్పిన తర్వాత తనకు తానుగానే సైలెంట్ అయిపోయింది. దాంతో అప్పటికి ఊపిరి పీల్చుకుంది. ఆ పవర్ ఫుల్ లేడీ నిర్మాతతో పోరాడేందుకు తాను కూడా ఒక లాయర్ ని పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్ లో లేడీ నిర్మాత మరెవరో కాదు.. ఏక్తా కపూర్. నటి పేరు బర్ఖా బిష్ట్. తన టీవీ షో నుంచి తప్పుకున్నందుకు ఏక్తా పగబట్టి తనపై కేసు వేసింది.
'టీన్ డ్రామా కిత్నీ మస్త్ హై జిందగీ'లో ఉదితగా టెలివిజన్ అరంగేట్రం చేసిన బర్ఖా బిష్ట్, బాలాజీ టెలిఫిల్మ్స్ సీరియల్ నుండి తప్పుకున్న తర్వాత నిర్మాత ఏక్తా కపూర్ తనపై కేసు పెట్టినప్పుడు ధీన స్థితిలో ఉన్నానని తెలిపింది. పరిశ్రమలో ఇబ్బందులు ఎదురవుతాయని, అవకాశాలు కోల్పోతానని భయపడినట్టు తెలిపింది. ముంబైలో నటించడానికి ఇంటిని విడిచిపెట్టిన తర్వాత తన తండ్రి ముందు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావించింది. తనకు 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై ఏక్తా దావా వేసిందని 45 ఏళ్ల నటి బర్ఖా బిష్ట్ వెల్లడించింది. ఏక్తా న్యాయవాదులు తనకు ఫోన్ చేసి లీగల్ నోటీసులు పంపుతూనే ఉండటంతో తాను ఫ్రీకింగ్ అయినట్లు కూడా గుర్తుచేసుకుంది. సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బర్ఖా ఈ విషయాలను బయటపెట్టారు.
నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. నేను ఒక న్యాయవాదిని నియమించుకుని కేసును వాదించాను. కాలక్రమేణా అది అర్థరహితమని గ్రహించాను. ఏక్తా వెనక్కి తగ్గినందుకు నేను కృతజ్ఞురాలిని. ఆ సమయంలో ఏక్తా నా కెరీర్‌ను నిర్మించడానికి లేదా నాశనం చేయడానికి శక్తిని కలిగి ఉంది. కేసు దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. నేను కోర్టు విచారణలకు హాజరవుతూనే నా కొత్త షో కోసం షూటింగ్ కొనసాగించాను. కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పలేదు! అని వెల్లడించింది. నేను సాధిస్తాను అని గర్వంతో వచ్చాను. కాబట్టి కేసులు గొడవలను నేనే మేనేజ్ చేయాలనుకున్నాను. కొత్త నటిగా నా కెరీర్ ముగిసి ఉండేది.. కానీ కొంత దైవిక శక్తి ద్వారా, ఏక్తా వెనక్కి తగ్గింది. ఆమె కోరుకుంటే నా కెరీర్‌ను ముగించేది అని బిష్ట్ తెలిపింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... బర్ఖా చివరిసారిగా పవర్ ఆఫ్ పాంచ్‌లో కనిపించారు. ఇందులో రివా అరోరా, జైవీర్ జునేజా, ఆదిత్య అరోరా, అనుభ అరోరా, బియాంకా అరోరా, యష్ సెహగల్, బర్ఖా బిష్త్, ఊర్వశి ధోలాకియా నటించారు.
ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైంది.
