Begin typing your search above and press return to search.

బర్రెలక్క.. బిగ్‌బాస్‌కి కొత్త కంటెస్టెంట్‌ దొరికిందా?

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క తెగ సందడి చేస్తోంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 11:33 AM GMT
బర్రెలక్క.. బిగ్‌బాస్‌కి కొత్త కంటెస్టెంట్‌ దొరికిందా?
X

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క తెగ సందడి చేస్తోంది. ఇన్ని రోజులు యూట్యూబ్‌ మరియు ఇన్‌ స్టా గ్రామ్‌ లో రీల్స్ చేస్తూ, షార్ట్‌ వీడియో లను షేర్ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది.

జాబ్ రాకపోవడంతో బర్లు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో షేర్‌ చేసిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ వీడియో వల్ల శిరీష పోలీసు కేసు ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొల్లాపూర్‌ నుంచి నామినేషన్ వేయడంతో సోషల్ మీడియాలో మరింత గా పాపులర్ అయింది.

తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా బర్రెలక్క కోసం వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. భారీ ఎత్తున ప్రచారం దక్కడంతో శిరీష వచ్చే ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్‌ అవ్వడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఎలక్షన్‌ పూర్తి అయిన వెంటనే బర్రెలక్క ను బిగ్‌ బాస్ టీం సంప్రదించినా ఆశ్చర్యం లేదు.

బిగ్ బాస్‌ లో ఈసారి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియా ద్వారానే పల్లవి ప్రశాంత్‌ కి గుర్తింపు దక్కింది. ఇప్పుడు బర్రెలక్క కూడా దక్కుతున్న పబ్లిసిటీ, సోషల్ మీడియా క్రేజ్ తో బిగ్ బాస్‌ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ జరుగుతోంది. బర్రెలక్క ఎమ్మెల్యే అయితే సీన్‌ మరోలా ఉంటుందేమో.