Begin typing your search above and press return to search.

అధికారికం: ఇండ‌స్ట్రీలో మ‌రో కొత్త ప్రేమ‌జంట హ‌ల్చ‌ల్

కానీ అప్పుడ‌ప్పుడు కెమెరా కంటికి జంట‌గా చిక్కిన‌ప్పుడు మీడియా హెడైలైన్స్ లోకొచ్చారు

By:  Tupaki Desk   |   21 Aug 2023 8:49 AM GMT
అధికారికం: ఇండ‌స్ట్రీలో మ‌రో కొత్త ప్రేమ‌జంట హ‌ల్చ‌ల్
X

పిల్లి బ్యాగ్ నుండి బయటపడింది... పెట్టె నుంచి అగ్గిపుల్ల జారిప‌డింది! మ‌రో కొత్త ప్రేమ‌జంట గుట్టు ర‌ట్ట‌యింది. క‌త్రిన‌-విక్కీ, కియ‌రా-సిద్ధార్థ్, అనుష్క‌- కోహ్లీ, త‌మ‌న్నా-విజ‌య్ వ‌ర్మ‌.. ఇలా జంట‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రేమ‌దోమ కుట్టింద‌ని ఓపెన‌వ్వ‌డానికి ముందు వీరంతా దాగుడుమూత‌ల ఆట‌ ఆడిన‌వారే. గ‌త కొంత‌కాలంగా ఇలానే ఆట ఆడుతున్నారు బానిటా సంధు- ఏపి థిల్లాన్. బానిట అప్ క‌మింగ్ హీరోయిన్.. ఏపీ థిల్లాన్ పాపుల‌ర్ ర్యాప‌ర్. ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని చాలా కాలంగా బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ ఓపెన‌వ్వ‌లేదు. ఇత‌ర జంట‌ల్లానే మంచి స్నేహితులు మాత్ర‌మేనంటూ త‌ప్పించుకున్నారు.

కానీ అప్పుడ‌ప్పుడు కెమెరా కంటికి జంట‌గా చిక్కిన‌ప్పుడు మీడియా హెడైలైన్స్ లోకొచ్చారు. తాజాగా ఈ జంట రొమాంటిక్ డేట్ కి సంబంధించిన ఫోటోలు వెబ్ లో వైర‌ల్ గా మారాయి. ఒక ఫోటోలో AP ధిల్లాన్ నేలపై కూర్చున్నప్పుడు బానిటా సంధు సరదాగా మంచం మీద నుండి అతని ముఖంపైకి వంగి ఉన్నట్లు క‌నిపిస్తోంది. ఈ జంట పార్టీకి సిద్ధమవుతున్న ఎగ్జ‌యిట్ మెంట్ ని మరొక ఫోటో వెల్ల‌డిస్తోంది. మరో ఫ్రేమ్‌లో బానిటా సంథు వెన‌క నిలుచుని ఉన్న‌ AP ధిల్లాన్ అలా జారిపోతున్న డ్రెస్ జిప్ ని స‌రి చేస్తుంటే.. ధైర్యంగా బానిటా కెమెరాకు పోజులిచ్చింది.

ఈ ఫోటోలతో పాటుగా బనితా సంధు భావోద్వేగ సందేశంతో శీర్షికను పెట్టారు. ''నాతో...'' అంటూ గుండె ఎమోజీని షేర్ చేసారు. దీని అర్థం బానిట త‌న హృద‌యాన్ని ప్రియుడికి అర్పించేసింద‌ని నెటిజ‌నులు అర్థం చేసుకున్నారు. జారిపోతున్న జిప్ ని స‌రిచేస్తూ త‌న ప్రేయ‌సిని అంటిపెట్టుకుని ఎల్ల‌వేళ‌లా సేవ‌లు చేస్తాన‌నే భరోసా థిల్లాన్ లో క‌నిపిస్తోంద‌ని అభిమానులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కొత్త ప్రేమ జంట ఇప్పుడు అధికారికంగా ఓపెన్ అయిన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు. ప్రేమ‌ప‌క్షుల కువ‌కువ‌లు ఇందుకు సింబాలిక్ గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. బానిటా సంధు 2018లో వరుణ్ ధావన్ సరసన షూజిత్ సిర్కార్ రొమాంటిక్ డ్రామా 'అక్టోబర్‌'తో తెరంగేట్రం చేసింది. ఆరంభ‌మే న‌ట‌న ప‌రంగా తనదైన ముద్ర వేసింది. అటుపై విక్కీ కౌశల్ 2021 బ‌యోపిక్ చిత్రం 'సర్దార్ ఉధమ్ సింగ్‌'లో తన నటనా నైపుణ్యంతో ఆక‌ట్టుకుంది. కోలీవుడ్ లో విక్ర‌మ్ కుమారుడు ధృవ్ స‌ర‌స‌న 'అర్జున్ రెడ్డి' రీమేక్ లోను న‌టించింది. AP ధిల్లాన్ మ్యూజిక్ వీడియో 'విత్ యు'లో అత‌డితో పాటు ఆడిపాడిన బానిటా సంధు తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయింద‌ని క‌థనాలొస్తున్నాయి.

ఇరువురి నడుమ ఏదో జ‌త‌కుదిరింది. 'విత్ యు..' సింగిల్ వీడియోలో ఆ ఇద్ద‌రి రొమాన్స్ ఎంతో కళాత్మకంగా ఆక‌ర్షించింది. బానిటా అత‌డిపై ల‌వ్ లీ మూవ్ మెంట్స్ ని ఏనాడూ దాచుకోలేదు. త‌న ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లతో దీనిపై హింట్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఇద్ద‌రి న‌డుమా అనుబంధం మ‌రో స్థాయికి చేరుకుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.