జాన్వీకపూర్ ఆన్ ఫైర్...బట్ బాలీవుడ్ సైలెంట్!
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సందర్భంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన స్లోగన్ `ఆల్ ఐస్ ఆన్ రఫా`. గాజాలో జరిగిన మారహోమం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ స్పందిస్తూ దీన్ని ఖండించారు.
By: Tupaki Desk | 26 Dec 2025 8:03 PM ISTగాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన సందర్భంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన స్లోగన్ `ఆల్ ఐస్ ఆన్ రఫా`. గాజాలో జరిగిన మారహోమం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ స్పందిస్తూ దీన్ని ఖండించారు. ఇక బాలీవుడ్ స్టార్స్ చాలా వరకు దీనిపై స్పందిస్తూ గాజా ప్రజలపై తమ సానుభూతిని వ్యక్తిం చేశారు. టాలీవుడ్‌తో పాటు దక్షిణాది స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. `ఆల్ ఐస్ ఆన్ రఫా` అంటూ ఓ పిక్‌ని షేర్ చేశారు. అయితే ఒక విషయంలో మాత్రం ఈ గొంతులన్నీ ఇప్పుడు మూగబోవడం, తమకు పట్టనట్టుగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై గత కొన్ని నెలలుగా నరమేధం జరుగుతోంది. ఎక్కడ హిందులు కనిపిస్తే రాక్షసత్వంగా చంపేస్తూ బంగ్లాదేశ్ దేశ్‌లో మారణహోమం జరుగుతోంది. ఇటీవల 27 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే యువకుడిని చంపి నడిరోడ్డుపైచెట్టుకు కట్టేసి కాల్చేయడం కలకలం సృష్టించింది. ఈ సంఘటనపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించడం లేదు, `ఆల్ ఐస్ ఆన్ రఫా` అంటూ స్పందించి గగ్గోలు పెట్టిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్, జయప్రద వంటి వారు మాత్రమే స్పందిస్తూ ఈ సంఘటనని ఖండిస్తున్నారు. మిగతా వారు మాత్రం ఆ ధైర్య చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జాన్వీ కపూర్ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మారణహోమంపై స్పందించింది. దీపు చంద్రదాస్ ని హత్య చేయడాన్ని బంగ్లాదేశ్‌లో జరుగుతున్న `హత్యాకాండ`గా అభివర్ణించింది. ప్రజలంతా దీన్ని ముక్తకంఠంతో వ్యతికేరించాలని కోరింది.
`దీపు చంద్రదాస్` అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ ఓ నోట్‌ని షేర్ చేసింది. `బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అనాగరికం. ఇది ఒక హత్యా కాండ. ఇది ఏకాకిగా జరిగిన సంఘటన కాదు. అతనిపై జరిగిన ఈ అమానవీయ బహిరంగ మూకదాడి గురించి మీకుతెలియకపోతే దాని గురించి చదవండి. వీడియోలు చూడండి. ప్రశ్నలు అగడగండి. ఇవన్నీ చూసిన తరువాత కూడా మీకు కోపం రాకపోతే మనకు తెలియకముందే ఈ కరమైన కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది` అంటూ ఫైర్ అయింది.
ప్రపంచంలో సగం దూరంలో జరిగే విషయాల గురించి మనం ఏడుస్తూనే ఉంటాం. అదే సమయంలో మన సొంత సోదర సోదరీమణులు సజీవ దహనం చేయబడుతున్నారు. మనం మన మానవత్వాన్ని మరచిపోయేలోపు ఏ రూపంలోనైనా ఉన్న తీవ్రవాదాన్ని ఖండించాలి, వ్యతిరేకించాలి` అని సైలెంట్‌గా ఉన్న వాళ్లకు హితబోధ చేసింది. సోకాల్డ్ స్టార్స్ అంతా రషా సంఘటనపై స్పందించి `దీపు చంద్రదాస్ హత్యాకాండపై మౌనం వహిస్తున్న వేళ జాన్వీ కపూర్ నిర్భయంగా తన వాయిస్ రైజ్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో అంతా తనని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికైనా మిగతా స్టార్స్ కూడా `ఆల్ ఐస్ ఆన్ రఫా`పై స్పందించినట్టే తాజా ఉదంతంపై స్పందించాలని నెటిజన్‌లు ఫైర్ అవుతున్నారు.
