Begin typing your search above and press return to search.

'ఓం భీమ్ బుష్'.. తెలుగమ్మాయితో హీటెక్కించే స్టెప్పులు!

అయితే మేకర్స్.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తొలి సింగిల్ బ్యాంగ్ బ్రోస్ ను గురువారం రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   7 March 2024 2:19 PM GMT
ఓం భీమ్ బుష్.. తెలుగమ్మాయితో హీటెక్కించే స్టెప్పులు!
X

నో లాజిక్స్.. ఓన్లీ మ్యూజిక్ అంటూ ఓం భీమ్ బుష్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయనతోపాటు కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించిన ఈ సినిమాను హుషారు మూవీ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యూటీ ఆయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా.. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు కలిసి పండించే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరి ముగ్గురు కలిసి బ్రోచేవారెవరురా మూవీలో టాలీవుడ్ లవర్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు మరోసారి నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే మేకర్స్.. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా తొలి సింగిల్ బ్యాంగ్ బ్రోస్ ను గురువారం రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య అయ్యంగర్ తోపాటు దినకర్ కల్వల, వివేక హరిహరన్, రుత్విక్ తలశిల్కర్ ఈ పాటను ఆలపించారు. లక్ష్మీ ప్రియాంక లిరిక్స్ అందించారు. సాంగ్ లో హీరోలు ముగ్గురూ రోమన్ గెటప్స్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. బ్యాంగ్ బ్రోస్ అంటూ ముగ్గురూ కలర్ ఫుల్ డ్రెస్సుల్లో అదరగొట్టారు.

ఈ సాంగ్ లో హుషారు బ్యూటీ ప్రియ వడ్లమాని మెరిసింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తెలుగమ్మాయి అయిన ప్రియ.. ప్రేమకు రెయిన్ చెక్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఓం భీమ్ బుష్ డైరెక్టర్ హర్ష తెరకెక్కించిన హుషారు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు బ్యాంగ్ బ్రోస్ సాంగ్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. మొత్తానికి హ్యాపీ మోడ్ లో సాగుతున్న ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ బ్యానర్ తో కలిసి సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 22వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.