Begin typing your search above and press return to search.

బండ్ల అతి కామెంట్స్‌... అనుభవం అయ్యిందా అన్నా?

తాజాగా ఎక్స్‌ లో బండ్ల గణేష్‌... అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్‌ చేశాడు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 7:18 PM IST
బండ్ల అతి కామెంట్స్‌... అనుభవం అయ్యిందా అన్నా?
X

టాలీవుడ్‌ ప్రేక్షకులకు బండ్ల గణేష్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం బండ్ల గణేష్‌ కెరీర్‌ను చూస్తే అర్థం అయి పోతుంది. ఇండస్ట్రీలో వ్యక్తి పూజ చేస్తే, భజన చేస్తే అవకాశాలు వస్తాయి, ఒకరిని నమ్ముకుంటే కచ్చితంగా పైకి రావచ్చు. కేవలం ప్రతిభను నమ్ముకోకుండా కాస్త తెలివిని, మాటకారితనం, వ్యక్తిపూజ ను నమ్ముకుంటే అందరి కంటే ముందుగానే ఇండస్ట్రీలో ఎదిగే అవకాశం ఉంటుంది అని బండ్ల గణేష్ నిరూపించాడు. ఆయన ఇండస్ట్రీలో ఎలా ఉండాలో అలా ఉన్నాడు, ఎలా ఉంటే ఎదుగుతారో అలాగే ఉన్నాడు. కనుక ఆయనను తప్పు అనడానికి ఏమీ లేదు.

ఒక జూనియర్‌ ఆర్టిస్టు నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో జర్నీ సాగించిన బండ్ల గణేష్ ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తన సినిమాల గురించి ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉండటం వల్ల వార్తల్లో ఉంటాడు. ఇక సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్ ద్వారా రెగ్యులర్‌గా ట్వీట్స్ చేయడం ద్వారా కూడా వార్తల్లో ఉంటాడు. బండ్ల గణేష్ రాజకీయాల్లో కూడా కొన్నాళ్లు కొనసాగాడు. దాంతో ఆయన రాజకీయంగా కూడా అప్పుడప్పుడు ట్వీట్స్ వేస్తూ ఉంటాడు. కొన్ని సార్లు మాత్రం ఆయన దేని గురించి ట్వీట్‌ చేశాడు అనేది కూడా తెలియకుండా ఇండైరెక్ట్‌గా ట్వీట్‌ చేస్తూ ఉంటాడు.

తాజాగా ఎక్స్‌ లో బండ్ల గణేష్‌... అతి ప్రేమ అతి అభిమానం అతి విశ్వాసం అతి నమ్మకం ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌ కి అర్థం ఏంటి భయ్యా అంటూ చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. అతి అనేది ఖచ్చితంగా మంచిది కాదని పెద్దలు అంటారు. ఆ విషయాన్ని ఇప్పుడు బండ్ల గణేష్ చెప్పడం చూస్తూ ఉంటే ఆయనకు ఇప్పుడు బోధ పడిందేమో అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఎప్పుడో పెద్దలు చెప్పిన విషయం నీకు ఇప్పుడు, ఇన్నాళ్లకు అర్థం అయిందా అన్నా అంటూ బండ్ల గణేష్ ట్వీట్‌ కి చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం ఆయన ఇప్పుడు ఈ ట్వీట్‌ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి అని చర్చిస్తున్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేష్ ట్వీట్‌ ను కొందరు మాత్రం లైట్‌ తీసుకున్నారు.

బండ్ల గణేష్ నిర్మాతగా చివరగా టెంపర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. కొన్నాళ్ల క్రితం పవన్‌ కళ్యాణ్ డేట్లు ఇచ్చాడు అంటూ హడావుడి చేశాడు. మంచి కథతో ఆయన్ను కలుస్తాను అంటూ ప్రకటించాడు. గత కొంత కాలంగా పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నాడు. పవన్‌ చుట్టూ ఉన్న వారు కొందరు బండ్లను దూరం చేశారట. ఈ విషయాన్ని బండ్ల గణేష్ పలు సందర్భాల్లో సన్నిహితులతో చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏంటి అనేది పక్కన పెడితే బండ్ల వంటి ఒక వ్యక్తి ఇండస్ట్రీలో కొనసాగితేనే మంచిది అనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేస్తున్నారు.