బండ్ల బిగ్ ప్లాన్.. ఏకంగా 30 సినిమాలట..
టాలీవుడ్ ప్రముఖ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే టాక్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
By: M Prashanth | 4 March 2026 12:42 PM ISTటాలీవుడ్ ప్రముఖ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే టాక్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆ సినిమాలు రూపొందుతున్నాయని ప్రచారం సాగుతోంది. దీంతో తాజాగా ఆ విషయంపై స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్.
ఓటీటీ ఈటీవీ విన్ ఒరిజినల్ గా రూపొందుతున్న సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని మూవీ ఈవెంట్ లో పాల్గొన్న బండ్ల గణేష్ ను హోస్ట్ ఆ మూడు సినిమాల విషయమై ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అది నా అమ్మాయి ప్రొడక్షన్. ఆమె వెనుక ఉంటాను. ఆమెకు సహకరిస్తున్న ఈటీవీ వారికి, ముఖ్యంగా ఈటీవీ విన్ టీమ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు.
"నాన్న.. ఒక్క సినిమా చేయాలని అడిగింది. మంచి సినిమా తీయాలి అని కోరింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను రిస్క్ చేయనని చెప్పాను. అప్పుడు ఈటీవీ విన్ వాళ్లను ఆమె అప్రోచ్ అవ్వగానే, వాళ్లంతా కలిసి కథను ఓకే చేసి ముందుకు వచ్చారు. అందుకే వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈటీవీ విన్ లో మూడు సినిమాలే కాదు.. ముప్పై సినిమాలు కూడా చేస్తాం" అని చెప్పారు.
ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. బండ్ల గణేష్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఉన్న వస్తున్న వార్తల్లో క్లారిటీ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నది నిజమే అయినా, అవి పూర్తిగా తన కూతురు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రాలు అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. నాన్నగా ఆమెకు అండగా నిలుస్తూ, కంటెంట్ పరంగా రాజీ పడకుండా ముందుకెళ్తానని పరోక్షంగా చెప్పారు.
ఇక బండ్ల గణేష్ కుమార్తె పేరు జనని. గతంలో ఓంకార్ యాంకర్ గా వ్యవహరించే సిక్స్త్ సెన్స్ షోలో బండ్ల గణేష్ తన కూతురితో కలిసి పాల్గొని ఆమెను మీడియాకు పరిచయం చేశారు. అంతేకాదు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కూడా తండ్రి, కూతురు కలిసి మొక్కలు నాటుతూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల వారి ఇంట్లో జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో కూడా జనని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ వేషధారణలో ఆమె కనిపించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఆమెనే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ, కొత్త కంటెంట్ తో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బండ్ల కుటుంబం నుంచి వస్తున్న కొత్త ప్రొడక్షన్ ప్రయత్నాలు, ముఖ్యంగా ఈటీవీ విన్ తో కలిసి చేస్తున్న సినిమాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి! మరి ఆ సినిమాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
