Begin typing your search above and press return to search.

అన్ స్థాపబుల్.. బాలయ్యతో కూల్ యానిమాల్

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణబీర్ ముంబై నుంచి హైదరాబాదులోకి అడుగు పెట్టాడు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 9:21 AM GMT
అన్ స్థాపబుల్.. బాలయ్యతో కూల్ యానిమాల్
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమా అటు బాలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేసి సక్సెస్ అందుకోవాలి అని దర్శకుడు సందీప్ తో పాటు హీరో రణబీర్ కపూర్ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.


ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణబీర్ ముంబై నుంచి హైదరాబాదులోకి అడుగు పెట్టాడు. ఇదివరకే బ్రహ్మాస్త్రతో అతనికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా డైరెక్ట్ గా తెలుగులో కూడా విడుదల చేయడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చేశాడు. దాంతో రణబీర్ కు తెలుగు ఆడియోన్స్ లో కూడా మంచి గౌరవం పెరిగింది.

అయితే ఇప్పుడు యానిమల్ కోసం మరో అడుగు ముందుకు వేసి రియాలిటీ షోలలో కూడా అడుగుపెట్టబోతున్నాడు. ముఖ్యంగా ఆహా అన్ స్టాపబుల్ షో లో కూడా రణబీర్ కపూర్ సందడి చేయబోతున్నాడు. ఇక ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాదులో అడుగుపెట్టి డైరెక్ట్ గా షో కోసం బాలయ్యను కలుసుకున్నారు. ఇక వారికి సంబంధించిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యానిమాల్ లో చాలా వైల్డ్ గా కనిపించిన రణబీర్ ఇప్పుడు టాలీవుడ్ వైల్డ్ హీరో నందమూరి బాలకృష్ణ తో ఎలా చిట్ చాట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య బాబు ఎంత సున్నితంగా ఉంటారో అలాగే ప్రశ్నలతో కూడా గెస్ట్ లను ఆలోచింపజేసేలా మాట్లాడుతూ ఉంటారు. ఇక వీరి సంభాషణ ఏ విధంగా ఉంటుంది అలాగే ఇంకా తెలుగుకి అలవాటు పడని రణబీర్ కపూర్ తో బాలయ్య హిందీలో ఎలా మాట్లాడుతారు అనే అంశాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

చూస్తుంటే వీరి మధ్యలో కొనసాగే ఈ షో పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక యానిమాల్ సినిమా డిసెంబరు 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద యానిమాల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.