Begin typing your search above and press return to search.

ఎన్నికల తర్వాత సీక్వెల్‌ తో బాలయ్య...!

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ను రూపొందిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 1:30 PM GMT
ఎన్నికల తర్వాత సీక్వెల్‌ తో బాలయ్య...!
X

నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ను రూపొందిస్తున్నాడు.

బాబీ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందట. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్ మరియు అఖండ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా అఖండ సినిమా అని గతంలోనే ఫిక్స్ అయింది. బాలయ్య మరియు బోయపాటి ఇద్దరూ కూడా అఖండ సినిమా సీక్వెల్‌ విషయమై ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించారు. అయితే కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య బోయపాటి మీడియా తో చెప్పుకొచ్చాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడమే ఆలస్యం అఖండ సీక్వెల్‌ ను బోయపాటి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అఖండ 2 ను సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలుస్తోంది. అఖండ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి. హిట్‌ సెంటిమెంట్ ను బాలయ్య తో బోయపాటి రిపీట్‌ చేసేనా చూడాలి.