Begin typing your search above and press return to search.

ఇందుకే బాలయ్య అన్‌స్టాపబుల్..!

తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్‌ షో యొక్క మొదటి ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో వచ్చింది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:23 AM GMT
ఇందుకే బాలయ్య అన్‌స్టాపబుల్..!
X

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యులతో అన్ స్టాపబుల్‌ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ను బాలయ్య ప్లాన్‌ చేశాడు. తన సినిమా యూనిట్‌ సభ్యులతో తన టాక్ షో లో బాలయ్య రచ్చ చేశాడు. బాలయ్య సినిమా ప్రమోషన్‌ తో పాటు షో రచ్చ చేయబోతుంది.

తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్‌ షో యొక్క మొదటి ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో దర్శకుడు అనిల్ రావిపూడి పై బాలయ్య వేసిన పంచ్ లతో పాటు కాజల్ ఇంకా శ్రీలీల తో సాగించిన ఆసక్తికర సంభాషణ.. వారితో చిన్న పిల్లాడి మాదిరిగా చేసిన అల్లరి ని చూపించారు. దాంతో ఎపిసోడ్‌ పై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది.

సున్నింతంగా రాజకీయాలను టచ్ చేస్తూ.. తనకు తానే సాటి అంటూ మరోసారి చెప్పుకుంటూ బాలయ్య షో సాగించాడు. మొత్తానికి ఎపిసోడ్‌ మొత్తం కూడా రసవత్తరంగా సాగబోతుంది అంటూ ప్రోమో ను చూస్తూ ఉంటే అనిపిస్తుందని అభిమానులు తెగ సంబుర పడుతున్నారు.

ప్రోమోలో బాలయ్య... ఇండస్ట్రీ మొత్తం కూడా బాలయ్య తో మరియు శ్రీలీలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు అన్నాడు. ఇక కాజల్ గురించి మాట్లాడుతూ నాతో చేయడంతో ఒక సర్కిల్‌ పూర్తి అయింది. మరి మోక్షూ తో చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను అన్నట్లుగా కాజల్ అగర్వాల్‌ సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది.

ఈ సారి అన్‌ స్టాపబుల్‌ ను లిమిటెడ్‌ వర్షన్ అంటున్నారు. అంటే ఎక్కువ ఎపిసోడ్‌ లు లేకుండా త్వరగానే ముగించబోతున్నారు. అంటే అయిదు ఆరు ఎపిసోడ్‌ లకే పరిమితం చేస్తారేమో చూడాలి. మొదటి ఎపిసోడ్‌ ను భగవంత్ కేసరి టీమ్‌ తో చేసిన బాలయ్య తదుపరి ఎపిసోడ్‌ ను ఎవరితో చేస్తాడు అనేది ఆసక్తి గా మారింది.