Begin typing your search above and press return to search.

బాల‌య్య విగ్గు సీక్రెట్ చెప్పేశారు!

రాంప్ర‌సాద్ ఆయ‌న అసిస్టెంట్ గా చేసారు. అప్ప‌ట్లో సెట్లో ప‌ని చేసే రోజుల్లో ఈరోజుల్లోలాగా క్యార‌వ్యాన్ లు లేవు అని బాల‌య్య బాబు తెలిపారు!

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:22 AM GMT
బాల‌య్య విగ్గు సీక్రెట్ చెప్పేశారు!
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ భోళా స్వ‌భావం గురించి తెలిసిందే. ఉన్న‌ది ఉన్న‌ట్టు చిన్న‌పిల్లాడిలా మాట్లాడేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. భ‌గ‌వంత్ కేస‌రి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో న‌ట‌సింహా బాల‌కృష్ణ త‌న విగ్గు సీక్రెట్ గురించి త‌న‌కు తానుగానే ఎలాంటి భేష‌జం లేకుండా ఓపెన‌య్యారు. ఆయ‌న సుమారు గంట పాటు ఇచ్చిన సుదీర్ఘ స్పీచ్ లో ఎన్నో విష‌యాలు దొర్లాయి. అందులో విగ్గు సీక్రెట్ నామోషీ లేకుండా ఓపెన‌వ్వ‌డం ఒక‌టి.

విఎస్ ఆర్ స్వామి అద్భుత కెమెరా ప‌నిత‌నంతో ఆర్టిస్టుల‌ను ఎంతో బాగా చూపించేవార‌ని, అదే తీరుగా రామ్ ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం త‌న‌ను అద్భుతంగా ఆవిష్క‌రించింద‌ని బాల‌య్య బాబు కితాబిచ్చారు. నిజానికి కెమెరాతో సినిమాని అద్భుతంగా ఎలివేట్ చేయొచ్చు. బాగున్న సినిమాని చెడ‌గొట్ట‌వ‌చ్చు. రామ్ ప్ర‌సాద్ కెమ‌రా ప‌నిత‌నం అద్భుతం.. అని పొగిడేశారు.

అంతేకాదు.. వీఎస్.ఆర్.స్వామి తో మేమంతా క‌లిసి ప‌ని చేసాం. రాంప్ర‌సాద్ ఆయ‌న అసిస్టెంట్ గా చేసారు. అప్ప‌ట్లో సెట్లో ప‌ని చేసే రోజుల్లో ఈరోజుల్లోలాగా క్యార‌వ్యాన్ లు లేవు అని బాల‌య్య బాబు తెలిపారు. హ్యాపీగా చ‌క్క‌గా ఆరుబ‌య‌ట చెట్ల కింద చాప వేసుకుని అక్క‌డే అన్నీ కానిచ్చేసేవార‌మ‌ని తెలిపారు. అలా ఆరుబ‌య‌ట సేద దీరే స‌మ‌యంలో త‌న విగ్గును తీసాన‌ని ... చ‌టుక్కున దాప‌రికం లేకుండా చెప్పేసారు బాల‌య్య బాబు.

ఇంకా ఏదో మాట్లాడుతూ... ఆడెవ‌డో అడిగాడు వెద‌వ‌..``ఈయ‌న విగ్గు పెట్టుకుంటాడా?`` అని త‌న‌దైన శైలిలో కామిక్ టైమింగ్ తో బాల‌య్య చెప్పిన తీరు క‌డుపుబ్బా న‌వ్వించింది. ``అవున‌య్యా నీకెందుక‌య్యా.. నువ్వేం పీక్కుంటావ్ గెడ్డం పెట్టుకోవ‌డానికి.. అవును విగ్గు పెట్టుకుంటా... `` అని అన్నాన‌ని గుర్తు చేసుకున్నారు. ఓపెన్ బుక్ మ‌న‌దంతా. ఎవ‌డికీ భ‌య‌ప‌డే ప‌నే లే.. వాడికి చెబుతున్నా.. మ‌ళ్లీ వాగాడంటే..! అంటూ స‌ర‌దాగా సంభాషించారు.

``ఛాయాగ్రాహ‌కుడు రామ్ ప్ర‌సాద్ చివ‌రి మూవ్ మెంట్ వ‌ర‌కూ నా పెర్ఫామెన్స్ ని ప‌ట్టుకుంటాడు.. మా ఇద్ద‌రి మ‌ధ్యా అండ‌ర్ స్టాండింగ్ ఉంది...`` అని రాంప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం గురించి బాల‌కృష్ణ‌ పొగిడేసారు. వీ.ఎస్.ఆర్ స్వామి ఎంతో అద్భుతంగా లైటింగ్ స్కీమ్ తో సినిమాలు తీసేవారు. అదే తీరుగా రాంప్ర‌సాద్ అఖండ‌కు ఒక అట్మాస్పియ‌ర్ క్రియేట్ చేసారు. ఈ సినిమాకి ఎలాంటి మాయ చేసారో కూడా చూస్తారు అని పొగిడేసారు.