Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ NBK పొలిటిక‌ల్ సిత్రాలు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంగ‌తి అటుంచితే.. ఎన్బీకే త‌న‌ త‌దుప‌రి సినిమాలో కూడా ఎమ్మెల్యేగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 April 2024 5:26 AM GMT
ఎన్నిక‌ల వేళ NBK పొలిటిక‌ల్ సిత్రాలు!
X

నందమూరి బాలకృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `లెజెండ్` 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నిక‌ల ముందు పాయింట్లను స్కోర్ చేయాలనే ఆశతో రీ రిలీజ్ కాగా దీనికి మంచి స్పంద‌న వ‌చ్చింది. రాజకీయ ఒరవడిని కలిగి ఉన్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ ఓట్లను సంపాదించడానికి సహాయపడుతుంద‌ని ఆశించారు.

వైజాగ్ లో పొలిటిక‌ల్ స్పేస్ ని ఆక్రమించుకోవడానికి సాహసించే రాయలసీమకు చెందిన విలన్ (జగపతి బాబు)కి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడే వ్యక్తి (బాలకృష్ణ) కథ ఇది. ప్రత్యర్థి జగపతి బాబు, అతడి కుటుంబ అహంకారాన్ని కించపరిచే బాలకృష్ణ శక్తివంతమైన పంచ్‌లైన్‌లు థియేటర్లలో విజిల్స్ వేయించాయి.

అంతేకాకుండా బాలకృష్ణ షూటింగ్‌లకు విరామం ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ - పార్లమెంటు ఎన్నికలలో టిడిపి దాని కూటమి భాగస్వాములైన జనసేన - బిజెపిలకు ఓట్లు ప‌డేలా ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. బాల‌య్య‌ పెద్ద స్క్రీన్‌పై తన లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్‌కి సరిపోయేలా ప్రచారంలో అదిరిపోయే పంచ్‌లైన్‌లను విస‌ర‌నున్నార‌ని మునుముందు రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంగ‌తి అటుంచితే.. ఎన్బీకే త‌న‌ త‌దుప‌రి సినిమాలో కూడా ఎమ్మెల్యేగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. బాబీ అలియాస్ కె.ఎస్.ర‌వీంద్ర‌ దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయ‌న‌ ఎమ్మెల్యేగా న‌టిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథ అయినప్పటికీ ఇందులో పంచ్ డైలాగులు చాలా బ్యాలెన్స్‌డ్ గా ఉండేలా బాబి జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు స‌మాచారం. పంచ్‌లు ఎంత‌గా ఉన్నా కానీ, ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ ఏడాది చివ‌రిలో సినిమా రిలీజ్ కి రానుంద‌ని కూడా తెలుస్తోంది. హిందూపూర్ లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్బీకే ఇప్పుడు హ్యాట్రిక్ పై క‌న్నేశారు. ఇలాంటి స‌మ‌యంలో అత‌డు పెద్ద తెర‌పైనా త‌న నిజజీవిత పాత్ర‌ను ఎంచుకోవ‌డం ఆస‌క్తిక‌రం.