Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రగిలే అగ్నికణం..ఆయ‌న‌కు మ‌ర‌ణం లేదు!

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ...ఒక‌ పరమార్థం కోసం.. సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారన్నారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 7:04 AM GMT
ఎన్టీఆర్ రగిలే  అగ్నికణం..ఆయ‌న‌కు మ‌ర‌ణం లేదు!
X

విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్‌ 28వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఆ మహానా యకుడిని స్మరించుకుంటున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఈనేప‌థ్యంలో నందమూరి బాలకృష్ణ ఉదయాన్నే ఘాట్‌కి వెళ్లారు. సినీ- రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసి..తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‎కు నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ...ఒక‌ పరమార్థం కోసం.. సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారన్నారు. 'వారికి మరణం ఉండదు. అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒక‌రు. ఆయన జీవన విధానమే భగ వంతుడి మార్గం. అన్ని వర్గాలకు ఆయన దేవుడు. ఆయన రగిలే ఒక అగ్నికణ మన్నారు'. గొప్ప జ‌న్మ‌ని పొందిన ఎన్టీఆర్ కి మ‌ర‌ణం లేదు. న‌టుడిగా అనిత‌ర సాధ్య‌మైన ఎన్నో పాత్ర‌లు పోషించారు.

అలాంటి న‌ట ధీరుడు ఎక్క‌డా కాన‌రాడు. సినిమాల్లోనే కాకుండా టీడీపీని స్థాపించి ప్ర‌తీ తెలుగు బిడ్డ‌కు రాజ‌కీయాలంటే ఎంటో నేర్పించారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించారన్నారు. ప్ర‌జ‌లకు అన్నం పెట్టిన నాన్న‌..ఆడ‌ప‌డుచుల‌కు ఆర్దిక స్వాతంత్య్రం క‌ల్పించిన అన్న‌. యువ‌త జీవితాల్లో వెలు గులు నింపిన నాన్న ఎన్టీఆర్ అన్నారు. విప్లవాత్మక సామాజిక మార్పులను ఆయనే తీసుకొచ్చారన్నారు.

తెలంగాణ లో ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌డం.. తాలూకాల‌ను మండ‌లాలుగా చేయ‌డం..సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేయడం.. మహిళా విశ్వవిద్యాలయం.. గురుకుల విద్యా విధానం.. సంక్షేమ హాస్టళ్లు.. జోగిని.. దేవదాసి వ్యవస్థలను రద్దు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు.