Begin typing your search above and press return to search.

దేవరకి వారం ముందు బాలయ్య..?

బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయ్ ఫైట్ ఉంటుందని వార్తలు రాగా.. ఫైట్ ఉంటుంది కానీ రెండు సినిమాల మధ్య వారం గ్యాప్ ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 3:30 PM GMT
దేవరకి వారం ముందు బాలయ్య..?
X

స్టార్ హీరోల సంక్రాంతి ఫైట్ ముగిసింది.. సమ్మర్ రేసులో ఏ సినిమా ఉంటుందో ఏ సినిమా వాయిదా పడుతుందో దాదాపు క్లారిటీ వచ్చింది. మే 9న కల్కి మొదటి భాగంతో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు. ఇక ఆగష్టు 15న పుష్ప రాజ్ ఆక్యుపై చేయగా ఆ నెల చివరన నాని సరిపోదా శనివారం అంటూ వస్తున్నాడు. సెప్టెంబర్ చివరి వారం నుంచి దసరా సీజన్ వరకు సినిమాల రిలీజ్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ లాక్ చేశారు మేకర్స్.

పవన్ ఒక 20 రోజులు టైం ఇస్తే సినిమా ఫినిష్ చేసేలా షెడ్యూల్ వేసుకున్నాడు డైరెక్టర్ సుజిత్. సెప్టెంబర్ చివరన పవన్ రాక కన్ఫర్మ్ అవ్వగా అక్టోబర్ 10న దసరా రేసులో ఎన్.టి.ఆర్ దేవర రిలీజ్ లాక్ చేసుకున్నాడు. దేవర పార్ట్ 1 తో దసరాకి తన దమ్ము చూపించాలని ఫిక్స్ అయ్యాడు తారక్. అయితే అదే దసరాకి అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ గా రాబోతున్నాడు. అక్టోబర్ 11న తండేల్ రిలీజ్ ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

దసరా బరిలో నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. NBK 109వ సినిమాగా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాలేదు కానీ అక్టోబర్ మొదటి వారం సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ 3న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయ్ ఫైట్ ఉంటుందని వార్తలు రాగా.. ఫైట్ ఉంటుంది కానీ రెండు సినిమాల మధ్య వారం గ్యాప్ ఉంటుందని అంటున్నారు.

అక్టోబర్ మొదటి వారంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఎలాగు వారం తర్వాత దేవర ఆగమనం ఉంటుంది. బాలయ్య సినిమా హిట్ టాక్ వస్తే వారం లో మాక్సిమం రికవర్ చేసేస్తారు. సో దేవర నుంచి పోటీ ఉంటుందని చెప్పలేం. ఇక ఎన్.టి.ఆర్ దేవర కచ్చితంగా అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. దసరా బరిలో వస్తున్న సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. మరి దేవరకు వారం ముందు బాలయ్య.. దేవర వచ్చిన రోజు తర్వాత నాగ చైతన్య వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాల వల్ల దేవరకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడాలి.