Begin typing your search above and press return to search.

బాలయ్య లుక్కుతోనే చితకొట్టేస్తున్నడు

కాగా, తాజాగా ఈ మూవీ లొకేషన్ నుంచి బాలయ్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. వైట్ కలర్ స్ట్రైప్స్ షర్ట్, బ్లూ కలర్ గల్ల లుంగీ ధరించి ఉన్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 12:44 PM GMT
బాలయ్య లుక్కుతోనే చితకొట్టేస్తున్నడు
X

నందమూరి నట సింహం నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి. అఖండ, వీర సింహారెడ్డిలతో వరస హిట్లతో ఉన్న ఆయన, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి చిన్న టీజర్ లాంటి వీడియో విడుదల చేయగా, ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అయ్యారు. బాలయ్య లుక్, డైలాగ్ డెలివరీ అంతా డిఫరెంట్ గా ఉంటుందని ఆ వీడియోతో అర్థమైపోయింది.

ఇక, ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ రావిపూడి బాలయ్య కోసం తన స్టైల్ మొత్తం మార్చినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ మూవీ లొకేషన్ నుంచి బాలయ్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. వైట్ కలర్ స్ట్రైప్స్ షర్ట్, బ్లూ కలర్ గల్ల లుంగీ ధరించి ఉన్నారు. ఆయనను కలవడానికి యువ హీరోయిన్ నక్షత్ర భగవంత్ కేసరి మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లింది.

అక్కడ ఆయనతో కలిసి భోజనం చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో దిగిన సెల్ఫీని షేర్ చేసింది. దీంతో, ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య లుక్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది.ఈ ఫోటోలో బాలయ్య తల వెంట్రుకలు, మీసం నల్లగా మెరుస్తూ ఉన్నా, గడ్డం మాత్రం తెల్లగా ఉండటం విశేషం. కానీ, ఆయన ముఖంలో గ్లో మాత్రం చాలా క్లియర్ గా కనపడుతోంది.

ఇక, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ మూవీలో బాలయ్య గ్రేస్, శ్రీలీల ఎనర్జీ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కావడం విశేషం.

షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. మాస్ కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావడం పక్క అని నందమూరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది.