Begin typing your search above and press return to search.

బాలయ్యను ఆ టైమ్ లో దింపితే బ్లాస్టే..

బడా సినిమాల రిలీజ్ ని దృష్టిలో పెట్టుకొని 'NBK109' మేకర్స్ వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 6:30 AM GMT
బాలయ్యను ఆ టైమ్ లో దింపితే బ్లాస్టే..
X

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత ఏడాది వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కోసం యంగ్ డైరెక్టర్ బాబి తో చేతులు కలిపాడు. మెగాస్టార్ కి 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ అందించిన బాబీ ప్రస్తుతం బాలయ్యతో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. 'NBK109' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

మొదటిసారి వీరి కాంబోలో సినిమా రాబోతుండడంతో 'NBK109' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లు వరుసగా వాయిదా పడటం బాలయ్య సినిమాకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. దేవర, కల్కి, పుష్ప 2, గేమ్ ఛేంజర్.. లాంటి బడా సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జూన్ వరకు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆ బడా సినిమాలు కనుక పోస్ట్ పోన్ అయితే ఏప్రిల్ లో ఏపీ ఎన్నికల అనంతరం వచ్చే పెద్ద సినిమా బాలయ్యదే అని అంటున్నారు. నిజానికి 'NBK109' సినిమాని దసరాకి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయానికి టాలీవుడ్ లో భారీ పోటీ అవకాశం ఉంది.

కాబట్టి బాలయ్య సినిమాని మే నాటికి పూర్తిచేసి వెంటనే రిలీజ్ చేస్తే అప్పటివరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో బాలయ్య సినిమాకి సోలో రిలీజ్ దొరకడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశాలున్నాయి. కాబట్టి బాలయ్యకి ఇదే మంచి ఛాన్స్. బడా సినిమాల రిలీజ్ ని దృష్టిలో పెట్టుకొని 'NBK109' మేకర్స్ వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరి నిర్మాతలు ఈ విషయంలో ఏం చేస్తారనేది చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.