Begin typing your search above and press return to search.

బాల‌య్య నోట ర‌ణ‌బీర్ ముత్తాత డైలాగ్

బాలయ్యకు డైలాగులు కూడా తెలుసని విన్న రణబీర్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ -దిలీప్ కుమార్ డైలాగ్స్ కూడా చేయమని అడిగాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:27 PM GMT
బాల‌య్య నోట ర‌ణ‌బీర్ ముత్తాత డైలాగ్
X

'మొఘల్ ఇ ఆజం' భార‌త‌దేశ‌పు క్లాసిక్ చిత్రాల్లో మేటిచిత్ర‌రాజం. ఈ సినిమా ఇప్ప‌టికీ చాలా మంది నటీనటుల, క్లాసిక్ డే ప్ర‌జ‌ల‌ హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. 1960లో విడుద‌లైన ఈ సినిమా ఔత్సాహిక ద‌ర్శ‌క‌నిర్మాతలకు గైడ్ లాంటిది. అయితే ఈ సినిమా అంటే విప‌రీతంగా ప్రేమించే హీరో నందమూరి బాలకృష్ణ అనే విష‌యం ఎంద‌రికి తెలుసు? ఆహా అన్‌స్టాపబుల్ విత్ NBK తాజా ఎపిసోడ్‌లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బాలయ్య మొఘల్ ఇ ఆజంపై తన అభిమానాన్ని చాటుకుంటూ అతిథులను ఆశ్చర్యపరిచాడు. యానిమ‌ల్ హీరో రణబీర్ కపూర్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా బాలయ్యతో అన్ స్టాప‌బుల్ టాక్ షోలో చేరారు. అదే క్ర‌మంలో క్లాసిక్ సినిమాపై బాల‌య్య త‌న అభిమానం చాటుకున్నారు.

బాలయ్యకు డైలాగులు కూడా తెలుసని విన్న రణబీర్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ -దిలీప్ కుమార్ డైలాగ్స్ కూడా చేయమని అడిగాడు. బాలయ్య దానికి స్పందిస్తూ హిందీ డైలాగులను అవ‌లీల‌గా, అప్రయత్నంగా చెప్పేశాడు. రణబీర్ కపూర్ కూడా ఒకటి లేదా రెండు పదాలతో స్వ‌రం క‌లిపాడు. బాలయ్య అద్భుతమైన జ్ఞాపకశక్తి .. మొఘ‌ల్ ఇ ఆజం చిత్రంపై అతడి అభిమానం నిజంగా ఆకట్టుకుంది. ఈ వైరల్ క్లిప్‌ను చూసిన తర్వాత, సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాక్షన్ తొడ కొట్టే భావనలు ప్రతిభ ఉన్న స్టార్ ని మూస చిత్రాల వైపు తప్పుదారి పట్టించాయని అభిప్రాయపడ్డారు. బాలయ్య నుండి పూర్తి చారిత్రక లేదా పౌరాణిక క‌థాంశంతో సినిమా రావాల‌ని కోరుకుంటున్నారు.

రణబీర్ కపూర్ ముత్తాత పృథ్వీ రాజ్ కపూర్ మొఘల్ ఇ ఆజంలో చక్రవర్తి అక్బర్ పాత్రను పోషించగా, దిలీప్ కుమార్ ప్రిన్స్ సలీమ్ పాత్రలో కనిపించాడు. అనార్కలిగా మధుబాల నటించింది. ఈ సినిమా ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్స్ లో ఒక‌టిగా నిలిచింది.