Begin typing your search above and press return to search.

డాక్ట‌ర్ అయిన శ్రీలీల‌కి బాల‌య్య మెడిసిన్ క్లాసులు!

దీంతో బాల‌య్య ప‌క్క‌న కూర్చోబెట్టుకుని మెడిసిన్ కి సంబంధించి కొన్ని ర‌కాల క్లాసులు తీసుకున్నారుట‌. ఆయ‌న‌కు తెలిసిన మెడిక‌ల్ విష‌యాల‌న్ని ఆమెతో పంచుకున్నారుట‌.

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:49 AM GMT
డాక్ట‌ర్ అయిన శ్రీలీల‌కి బాల‌య్య మెడిసిన్ క్లాసులు!
X

శ్రీలీల మెడిస‌న్ చ‌దువుతుండ‌గానే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడా మెడిస‌న్ కోర్సు కూడా పూర్త యింది. ఈ మ‌ధ్య‌నే చివ‌రి సంవ‌త్స‌రం ప‌రిక్ష‌లు రాసింది. ఎంబీబీఎస్ బోర్డు కి అర్హురాలైంది. ఇక పై యాక్ట‌ర‌మ్మ‌ని...డాక్ట‌ర‌మ్మ అని కూడా పిలొచ్చు. మ‌రి ఇన్ని అర్హ‌త‌లున్న‌ డాక్ట‌ర‌మ్మ‌కే న‌ట‌సింహం మెడిక‌ల్ క్లాసులు తీసుకున్నారంటే న‌మ్ముతారా? న‌మ్మాల్సిన నిజం ఇది. శ్రీలీల చివ‌రి ఏడాది ప‌రీక్ష‌లు `భ‌గ‌త‌వంత్ కేస‌రి` సినిమా చేసే టైమ్ లోనే రాసింది.

అలా ప‌రీక్ష‌లు రాసి నేరుగా ఆ సినిమా సెట్స్ కి వెళ్లిందిట‌. దీంతో బాల‌య్య ప‌క్క‌న కూర్చోబెట్టుకుని మెడిసిన్ కి సంబంధించి కొన్ని ర‌కాల క్లాసులు తీసుకున్నారుట‌. ఆయ‌న‌కు తెలిసిన మెడిక‌ల్ విష‌యాల‌న్ని ఆమెతో పంచుకున్నారుట‌. ఇది విని శ్రీలీ ఆశ్చ‌ర్య‌పోయిందిట‌. డాక్ట‌ర్ చ‌ద వింది నేను...నేను చెప్పాల్సిన విష‌యాలు ఆయ‌న చెబుతున్నారేంటి? అని ఆశ్చ‌ర్చ‌పోయిందిట‌. మీరు మెడిసిన్ చేయ‌లేదు ..ఇవ‌న్నీ మీకు ఎలా తెలుస‌ని బాల‌య్య‌ని అడిగితే!

బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రికి చైర్మన్ గా ప‌నిచేయ‌డంతో ఆ రంగంపై కొంత అవ‌గాహ‌న సంపాదించిన‌ట్లు చెప్పుకొచ్చారుట‌. బాల‌య్య మెడిక‌ల్ గురించే కాదు. అన్ని ర‌కాల అంశాల‌పైనా ఎంతో పట్లు ఉన్న జ్ఞాని అని అంది. ప్ర‌తీ రంగం గురించి బాల‌య్య సార్ చెబుతూనే ఉంటారంది. అలాగే న‌టిగా ఎలా న‌డుచుకోవాలి? ఎప్పుడు ఎలా మ‌సులు కోవాలి? అన్న‌ది కూడా చెప్పారుట‌. అలాగే మొద‌టిసారి బాల‌య్య ని క‌లిసిన‌ప్పుడు భ‌యం భ‌యంగానే క‌లిసిందిట.

మాట‌లు క‌ల‌ప‌డం కూడా భ‌యం భ‌యంగానే క‌లిపిందిట‌.` కానీ అలా మాట్లాడాక ఆయ‌న మన‌సేంటో అర్ధ‌మైపోయింది. ఆయ‌న మ‌న‌సుకు త‌గ్గ‌ట్టే బాల‌కృష్ణ అనే పేరు పెట్టారు. ఆయ‌న చాలా స్వీట్ ప‌ర్స‌న్ అంది`. మొత్తాని బాల‌య్య తో మొద‌టి సినిమాతోనే బోలెడంత అనుభ‌వాన్ని సంపాదించింది.