Begin typing your search above and press return to search.

కన్నప్ప.. రంగంలోకి మరో టాలీవుడ్ స్టార్?

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ మొదలైంది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 7:52 AM GMT
కన్నప్ప.. రంగంలోకి మరో టాలీవుడ్ స్టార్?
X

మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ గా తెరపైకి రాబోతున్న సినిమా భక్తకన్నప్ప. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కన్నప్ప సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి అని మేకర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అంతేకాకుండా ఇందులో నటీనటులు కూడా వివిధ భాషల నుంచి సెలెక్ట్ చేసుకుంటూ ఉండడంతో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరుగుతున్నాయి.

ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

మలయాళం నుంచి మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక తమిళ నటుడు శరత్ కుమార్ అలాగే మరి కొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా కాస్టింగ్ తోనే మేకర్స్ మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ మొదలైంది. ఆయన మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఐదు నిమిషాల ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులతో సంప్రదించగా చివరికి బాలకృష్ణను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో బాలకృష్ణ మంచు మనోజ్ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా..' సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మంచు విష్ణు సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.