Begin typing your search above and press return to search.

సీనియ‌ర్స్ లో 2023 బాల‌య్యదే!

సీనియ‌ర్ హీరోల్లో 2023 లో విజ‌యాలు ఎవ‌రి సొంతం? వ‌రుస విజ‌యాలు ఏ హీరో మార్కెట్ ని రెట్టింపు చేసాయి? అంటే క‌చ్చితంగా న‌ట‌సింహ బాల‌కృష్ణ పేరు ఒక్క‌టే చ‌ర్చించాలి.

By:  Tupaki Desk   |   11 Dec 2023 2:30 PM GMT
సీనియ‌ర్స్ లో 2023 బాల‌య్యదే!
X

సీనియ‌ర్ హీరోల్లో 2023 లో విజ‌యాలు ఎవ‌రి సొంతం? వ‌రుస విజ‌యాలు ఏ హీరో మార్కెట్ ని రెట్టింపు చేసాయి? అంటే క‌చ్చితంగా న‌ట‌సింహ బాల‌కృష్ణ పేరు ఒక్క‌టే చ‌ర్చించాలి. అవును 2023 లో ఏకంగా మూడు విజ‌యాల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసారు. అంత‌కుముందు రిలీజ్ అయిన `అఖండ` భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసింద‌. అటుపై `వీర‌సింహారెడ్డి` తో మ‌రో మాస్ హిట్ ఖాతాలో వేసుకున్నారు.

ఆ వేంట‌నే `భగ‌వంత కేస‌రి` రూపంలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డింది. ఈ మూడు ఎక్క‌డా ఆర్డ‌ర్ మిస్ కాకుండా విజ‌యాలు సాధించాయి. మ‌ధ్య‌లో 2022లో సినిమాలు చేయ‌లేదు త‌ప్ప‌! బాల‌య్యకి ఎక్క‌డా మైన‌స్ క‌నిపించ‌లేదు. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య‌`...`గాడ్ ఫాదార్` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చినా వైఫ‌ల్యం త‌ప్ప‌లేదు.

ఇక ఈ ఏడాది `వాల్తేరు వీర‌య్య‌`తో స‌క్సెస్ ఖాతా తెరిచారు. కానీ ఆ విజ‌యాన్ని త‌దుప‌రి కొన‌సాగించ లేక‌పోయారు. `భోళా శంక‌ర్` భారీ ప‌రాజ‌యాన్ని అందించింది. దీంతో మెగాస్టార్ కెరీర్ లో 2023 కూడా అసంపూర్ణంగానే క‌నిపిస్తోంది. ఇక కింగ్ నాగార్జున గ‌తేడాది వ‌రుస‌గా రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. `బంగార్రాజు` మంచి విజ‌యం సాధించినా `ఘోస్ట్` ప‌రాభ‌వం ఎదుర్కుంది.

దీంతో 2023లో ఏ సినిమా చేయ‌కుండా ఖాళీగానే ఉన్నారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ కి `ఎఫ్ -3` త‌ర్వాత విజ‌యం ప‌డ‌లేదు. కొత్త సినిమాలు చేసింది లేదు. స‌రైన క‌థ‌ల కోసం వెయిట్ చేసి ఏడాదంతా వృద్ధా చేసారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో `సైంధ‌వ్` తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. మొత్తంగా ఈ న‌లుగురు సీనియ‌ర్ హీరోల్లో 2023 లో బెస్ట్ ఎవ‌రు అంటే బాల‌య్యే క‌నిపిస్తున్నారు. ఆయ‌న సినిమాల జోరుతో పాటు స‌క్సెస్ లు వ‌రుస‌గా క‌నిపిస్తున్నాయి. ఆర‌కంగా బాల‌య్య 2023ని సంతోషంగా ముగిస్తున్నారు.