Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాలయ్య హ్యాట్రిక్‌ క్రియేటర్స్

బ్యాక్ టు బ్యాక్ సూపర్‌ హిట్స్ ను దక్కించుకుని ఏకంగా హ్యాట్రిక్ నమోదు చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:51 AM GMT
పిక్ టాక్ : బాలయ్య హ్యాట్రిక్‌ క్రియేటర్స్
X

నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాలు చేయకుండా వయసుకు తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న సమయంలో ఏ సీనియర్‌ హీరోకు దక్కని బ్యాక్ టు బ్యాక్ సూపర్‌ హిట్స్ ను దక్కించుకుని ఏకంగా హ్యాట్రిక్ నమోదు చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో సందేహం లేదు.


అఖండ కి ముందు బాలయ్య చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ బొక్క బోర్లా పడ్డాయి. దాంతో బాలయ్య కెరీర్‌ విషయంలో విమర్శలు వచ్చాయి. అలాంటి సమయంలో వచ్చిన అఖండ సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచి బాలయ్య, బోయపాటికి హ్యాట్రిక్‌ ను అందించడం జరిగింది.

అఖండ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుని వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని బాలయ్య కు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన విషయం తెల్సిందే.

బాలయ్య కు హ్యాట్రిక్ విజయాలను ఇచ్చిన దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్‌ మలినేని మరియు అనిల్ రావిపూడిలు ఒకే ఫ్రేమ్‌ లో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఒక ప్రైవేట్‌ పార్టీ లో వీరు ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో పాటు ఆ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు.

ఈ ఫోటోను చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మా హీరో కు హ్యాట్రిక్ విజయాలను అందించిన సినిమాల క్రియేటర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌ లో కనిపించడం చాలా సంతోషంగా ఉందటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా హిట్‌ అయ్యి బాబీ వీరి సరసన నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.