Begin typing your search above and press return to search.

బాల‌య్య పుర‌స్కారాల‌కు అర్హుడు కాదా?

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం అర్థ‌రాత్రి వేళ ప‌ద్మ పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

By:  Tupaki Desk   |   26 Jan 2024 11:04 AM GMT
బాల‌య్య పుర‌స్కారాల‌కు అర్హుడు కాదా?
X

ఎంపిక చేసుకున్న రంగంలో శిఖ‌రం ఎత్తుకు ఎదిగి, అటుపై ప్ర‌జాబాహుళ్యంలో సామాజిక సేవ‌లో త‌రించి మంచి పేరు తెచ్చుకున్న‌ చాలా మందికి ఏటేటా ప‌ద్మ పుర‌స్కారాలు అందుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సామాజిక సేవ చేసిన అంద‌రికీ ప‌ద్మ పుర‌స్కారం ద‌క్కుతుందా? అంటే అలాంటిదేమీ లేదు. ప‌ద్మ పుర‌స్కారాలు కొంద‌రికి ద‌క్కుతున్నాయి.. మ‌రికొంద‌రు అర్హుల‌కు ద‌క్క‌డం లేద‌నే వాద‌న హీరోల అభిమానుల్లో ఉండ‌నే ఉంటుంది. త‌మ ఫేవ‌రెట్ స్టార్ ఈ పుర‌స్కారానికి అన‌ర్హుడా? అంటూ క‌ల‌త చెందే వీరాభిమానులు కొంత ఘాటుగానే స్పందిస్తున్నారు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గురువారం అర్థ‌రాత్రి వేళ ప‌ద్మ పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో 15 మంది తెలుగు దిగ్గ‌జాల పేర్లు ఉన్నాయి. వారిలో ఐదుగురికి పద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారాలు ద‌క్క‌గా, ఇందులో తెలుగు చిత్ర‌సీమ నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్ర‌మే క‌నిపించింది. ఇంత‌కుముందు ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న చిరుకు ఇప్పుడు ప‌ద్మ‌విభూష‌ణ్ ద‌క్క‌డంతో మెగా కాంపౌండ్ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగాభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

అయితే ఇదే సంద‌ర్భంలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు కొంత చిన్న‌బుచ్చుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వేల మంది చిన్నారులు, పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ (బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి) అందించిన నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎందుకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఇవ్వరు? అంటూ ఒక అభిమాని సామాజిక మాధ్య‌మాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఆవేద‌న వ్య‌క్తం చేసాడు. ఎన్బీకే కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించారు. భైరవద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం, మంగమ్మ గారి మనవడు, ఆదిత్య 369, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ, సింహ, శ్రీ రామరాజ్యం, భగవంత్ కేసరి, వీరసింహ రెడ్డి, లెజెండ్ లాంటి అనేక అద్భుతమైన కళాఖండాలు ఆయన మాత్రమే చేయగలరు. ఇటువంటి కళాకారుడికి ఎందుకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎందుకు ఇవ్వరు??? అంటూ అత‌డు ప్ర‌శ్నించాడు. ఎన్బీకేకి కెరీర్ లో నంది అవార్డులు ఉన్నాయి.. ఫిలింఫేర్ లు ఉన్నాయి. కానీ జాతీయ అవార్డ్ కానీ, ప‌ద్మ పుర‌స్కారం కానీ ద‌క్క‌లేదు. దీనిని స‌ద‌రు అభిమాని ప‌రోక్షంగా ప్ర‌శ్నించారు.

సొంత పార్టీ అధికారంలో ఉన్నా కానీ పైరవీలు చేయించుకోరు కాబట్టి బాల‌య్య‌కు పుర‌స్కారాలు రాలేద‌ని స‌ద‌రు అభిమాని వాపోయాడు. బాలకృష్ణ గారికి కేవలం రాజకీయాల వల్ల ఆయనకు అందాల్సిన సత్కారాలు దూరం అవుతుంటే కోట్లాది నందమూరి అభిమానులకు బాధగా ఉంది. ఆనాడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి అన్యాయం చేశారు. నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి అన్యాయం చేస్తున్నారు అని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నో గొప్ప పాత్ర‌ల‌కు జీవం పోసిన లెజెండ‌రీ న‌టుడు ఎన్టీఆర్ కి ప‌ద్మ‌శ్రీ మిన‌హా జాతీయ అవార్డ్ లేదు.. భార‌త‌ర‌త్న‌కు సిఫార‌సు లేదు..! కొందరు అంటారు అవార్డులు రివార్డులు వారికి అలంకారం కాదు అని, కానీ చరిత్రలో కనిపించేది అవే అని అర్థం చేసుకోవాలి అని అభిమాని అన్నారు.