Begin typing your search above and press return to search.

బాలయ్య - చిరు.. ఓ స్పెషల్ ప్లాన్?

ఒక స్పెషల్ ఎపిసోడ్ గా దీనిని డిజైన్ చేయాలని అనుకుంటున్నారంట. ఆ ప్రయత్నంలోనే ప్రస్తుతం ఆహా టీం ఉన్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:16 AM GMT
బాలయ్య - చిరు.. ఓ స్పెషల్ ప్లాన్?
X

నందమూరి బాలకృష్ణతో ఆహా ఓటీటీ ప్లాన్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పటికి రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చరిత్రలోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. సీజన్ 2 అయితే గ్రాండ్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ఈ సీజన్ లో కొన్ని ఎపిసోడ్స్ కి పాలిటికల్ టచ్ కూడా ఇచ్చారు.

మొదటి ఎపిసోడ్ ని చంద్రబాబుతో ప్లాన్ చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఆఖరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేశారు. ఇది కూడా బంపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి అన్ స్టాపబుల్ సీజన్ 2లో మెగాస్టార్ చిరంజీవిని ఇక ఎపిసోడ్ కి గెస్ట్ గా పిలవాలని అనుకున్నారు. అయితే ఎందుకనో అది సెట్ కాలేదు. ఓ సందర్భంగా మెగాస్టార్ ఈ షోపై సుముఖత వ్యక్తం చేశారు.

ఫైనల్ గా బాలయ్య హోస్ట్ గా, మెగాస్టార్ గెస్ట్ గా ఇంటర్వ్యూకి సంబందించిన ప్రయత్నాలు వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ రాయభారం కరెక్ట్ గా పనిచేయడంతో మొత్తానికి ఇద్దరు కలిసి సందడి చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ని అన్ స్టాపబుల్ సీజన్ 3 కోసం ముందుగా అనుకున్న ఇప్పుడు ప్లాన్ మార్చుకున్నారంట.

ఒక స్పెషల్ ఎపిసోడ్ గా దీనిని డిజైన్ చేయాలని అనుకుంటున్నారంట. ఆ ప్రయత్నంలోనే ప్రస్తుతం ఆహా టీం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే త్వరలో ఈ ఇంటర్వ్యూ స్పెషల్ ఎపిసోడ్ కి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.

చాలా కాలంగా మెగాస్టార్, బాలయ్య మధ్య కొద్దిగా అభిప్రాయబేధాలు ఉన్నాయి. బాలయ్య కొన్ని సందర్భాంలో మీడియా ముఖంగానే మెగాస్టార్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ తో వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు ఇద్దరి మధ్య స్నేహాన్ని మరింత స్ట్రాంగ్ గా ఆడియన్స్ లోకి పంపించాలని అనుకుంటున్నారంట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనేది వేచి చూడాలి.