Begin typing your search above and press return to search.

బాలయ్య - బోయపాటి.. ఏం జరుగుతోంది?

వీరి కాంబోలో కొత్త సినిమా అనగానే అందరూ అఖండ-2 ఎక్స్​పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఆ మధ్య ఓ రియాలిటీ షోలో బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 5:05 AM GMT
బాలయ్య - బోయపాటి.. ఏం జరుగుతోంది?
X

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ సినిమాలుగా గుర్తింపు తేవడమే కాకుండా ఆయన కెరీర్‌లో సూపర్​ హిట్​ చిత్రాలుగా కూడా నిలిచాయి. బోయపాటి మిగతా హీరోలతో ఎలాంటి సినిమా చేసినా.. బాలకృష్ణతో సినిమా అంటే మాత్రం రెచ్చిపోయి డైలాగులు చెప్పిస్తారు. ఫైట్లు చేయిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఊపు తెప్పిస్తారు.

అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి- బాలయ్య కూడా అదే పనిలో ఉన్నారు! ఈ సూపర్ హిట్ కాంబో నాలుగో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వీరి కాంబోలో కొత్త సినిమా అనగానే అందరూ అఖండ-2 ఎక్స్​పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఆ మధ్య ఓ రియాలిటీ షోలో బోయపాటి స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు బాలయ్య మాత్రం ఫ్రెష్ కథతో వెళ్దామని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

అందుకే నటసింహానికి ఇటీవలే బోయపాటి మూడు కథలు చెప్పారట. ఈ మూడు స్టోరీలు బాలయ్యకు నచ్చాయట. దీంతో బోయపాటి ఏ కథతో ముందుకు వెళ్లాలో తెలియక డైలమాలో పడ్డారట. అయితే బాలకృష్ణకు మూడు స్టోరీలు నచ్చడంతో ఏ స్టోరీని ఫైనల్ చేసి బోయపాటి ప్రేక్షకుల ముందుకు వస్తారన్నది టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే బాలయ్య భగవంత్ కేసరిలో థియేటర్లలోకి రాగా.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్​లో ఇది 109 వ చిత్రం. దీంతో ఈ సినిమా ఎన్​బీకే 109 (NBK) వర్కింగ్ టైటిల్​తో రూపొందనునుంది. సితార బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన సీనియర్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలయ్య. ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమాతో హిట్టు అయితే ఆయనకు తిరుగులేదు. ఆ తర్వాత వచ్చే బోయపాటి ఎలాగో హిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వరుసగా ఐదు సినిమాలను హిట్లు కొట్టిన సీనియర్ హీరో గా ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు.