Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ ఫస్ట్ వీక్.. బాలయ్య ట్రెండ్ సెట్

ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది అఖండ మూవీతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:49 AM GMT
బాక్సాఫీస్ ఫస్ట్ వీక్.. బాలయ్య ట్రెండ్ సెట్
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. అనిల్ రావిపూడి బాలయ్య సీరియస్ యాక్షన్ మోడ్ నుంచి కొంత బయటకొచ్చి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి భగవంత్ కేసరి స్టొరీ నేరేట్ చేశారు.

ఆడియన్స్ కి కూడా ఈ సినిమాలో కొత్త బాలయ్యని చూసినట్లు అనిపించింది. అందుకే దసరాకి వచ్చిన మూడు సినిమాలలో భగవంత్ కేసరి ఎక్కువ మార్కులు వేశారు. ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది అఖండ మూవీతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డితో మరో హిట్ వచ్చి చేరింది. ఈ ఏడాది చివర్లో భగవంత్ కేసరి హిట్ తో హ్యాట్రిక్ సాధించారు. ఇక ఈ మూడు సినిమాలు మొదటి వారం కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో వీరసింహారెడ్డి ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం 94.65 కోట్ల గ్రాస్ అందుకుంటే అందులో 58.51 కోట్ల షేర్ ఉంది.

వరల్డ్ వైడ్ గా వీరసింహారెడ్డి మొదటి వారం 114.95 కోట్ల గ్రాస్ అందుకుంది. సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ గా భగవంతత్ కేసరి నిలిచింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో 75.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అందులో 44.54 కోట్ల షేర్ ఉంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 98.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే నిర్మాత లెక్కల ప్రకారం 112.18 కోట్లు ఉండటం విశేషం.

అఖండ మూవీ తెలుగు రాష్ట్రాలలో 71.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో 45.11 షేర్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 87.09 కోట్ల గ్రాస్ ని అందుకుంది. బడ్జెట్ పరిధులు బట్టి చూసుకుంటే అఖండ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే వీరసింహారెడ్డి హిట్ బొమ్మగా మారింది. భగవంత్ కేసరి ఇంకా బ్రేక్ ఎవెన్ అందుకోవాల్సి ఉంది.