Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మకు ఆ ఇద్దరు కూడా సెట్టయితే..

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.

By:  Tupaki Desk   |   1 May 2024 4:09 AM GMT
ప్రశాంత్ వర్మకు ఆ ఇద్దరు కూడా సెట్టయితే..
X

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇమేజ్ బిల్డ్ చేసుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. PCU అంటూ ప్రత్యేకమైన వరల్డ్ ఏర్పాటు చేసి దానిలో ఏకంగా 10 సూపర్ హీరోల చిత్రాలు చేయడానికి ప్రశాంత్ వర్మ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అవన్నీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటి ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జై హనుమాన్ మూవీకి రంగం సిద్ధం అయ్యింది.

స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తాడని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. అయితే అతనెవరనేది చెప్పలేదు. మరో వైపు అధీరా అనే సినిమాని ఎనౌన్స్ చేశాడు. ఫీమేల్ సెంట్రిక్ తో ఒక సూపర్ విమెన్ మూవీ కూడా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో రాక్షస్ అనే సూపర్ హీరో చిత్రాన్ని చేయనున్నాడని తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ గా ప్రకటిస్తారని టాక్.

ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా PCUలో ఒక సూపర్ హీరో కథలో చేయబోతున్నాడనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే బాలయ్యకి ప్రశాంత్ వర్మ కథ కూడా వినిపించి ఒకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో ప్రశాంత్ వర్మకి మంచి అనుబంధం ఉంది. అన్ స్థాపబుల్ ప్రోమోల కోసం వీరు కలిసి పని చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో సినిమా రావడం ఖాయం అని టాక్ నడుస్తోంది.

ఇక మాస్ మహారాజ్ రవితేజ కూడా PCUలో భాగం కాబోతున్నాడంట. అతనికి ఓ ఇంటరెస్టింగ్ లైన్ లో ప్రశాంత్ వర్మ కథను నేరేట్ చేసాడంట. కామిక్ టచ్ తో ఉండే సూపర్ హీరో పాత్రలో రవితేజని ప్రశాంత్ వర్మ చూపించాలని అనుకుంటున్నారంట. ఈ ఇద్దరు హీరోలు PCUలోకి వస్తే మాత్రం కచ్చితంగా అద్భుతమైన కథలని చూసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత బోయపాటితో అఖండ 2 చేయనున్నాడు. ఇది కూడా ఓ తరహా సూపర్ హీరో చిత్రమనే చెప్పాలి. ఇక రవితేజ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. అలాగే అనుదీప్ తో కూడా ఒక సినిమా అనుకుంటున్నాడు. మరి బాలయ్య, రబితేజ ప్రశాంత్ వర్మతో ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారో చూడాలి.