Begin typing your search above and press return to search.

వైరల్‌ : బాలయ్య మళ్లీ కొత్త లుక్‌ అదుర్స్‌

ఇలాంటి సమయంలో బాలయ్య చేస్తున్న సినిమా పై అంచనాలు భారీగా ఉండటం సహజం.

By:  Tupaki Desk   |   6 Jan 2024 10:40 AM GMT
వైరల్‌ : బాలయ్య మళ్లీ కొత్త లుక్‌ అదుర్స్‌
X

నందమూరి బాలకృష్ణ హీరోగా వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలు చేసి హ్యాట్రిక్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోగా ప్రస్తుతం బాలయ్య ఫుల్‌ స్వింగ్‌ లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో బాలయ్య చేస్తున్న సినిమా పై అంచనాలు భారీగా ఉండటం సహజం.


బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమా తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బాబీ ఇప్పుడు బాలయ్య తో సినిమా చేస్తూ ఉన్నాడు. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఇక బాలయ్య తాజా చిత్రానికి సంబంధించిన లుక్ ను రివీల్‌ చేయలేదు. అయితే తాజాగా లీక్ అయిన ఫోటోల్లో బాలయ్య తాజా చిత్రం లో ఎలా ఉండబోతున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. బాలయ్య మరియు బాబీ కాంబో మూవీ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా ఈ లీక్ పిక్‌ ఉంది.

బాలయ్య మరియు బాబీ కాంబో మూవీ చాలా స్టైలిష్ అండ్‌ మ్యాన్లీగా ఉన్నాడని అభిమానులు అంటున్నారు. ఈ రేంజ్ లో బాలయ్య ను బాబీ చూపించినట్లయితే మరో విజయం ఈ సినిమా తో దక్కబోతుంది అంటూ ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.