స్క్విడ్ గేమ్ అయినా.. బాలయ్య చెప్పినట్టు ఆడాల్సిందే..!
వరల్డ్ సినీ లవర్స్ ని మెప్పించిన కొరియన్ సీరీస్ లు చాలా ఉన్నాయి. ఐతే థ్రిల్లర్ కం ఒక అడ్వెంచర్ సీరీస్ గా వచ్చిన స్క్విడ్ గేమ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది.
By: Tupaki Desk | 17 July 2025 6:30 PM ISTవరల్డ్ సినీ లవర్స్ ని మెప్పించిన కొరియన్ సీరీస్ లు చాలా ఉన్నాయి. ఐతే థ్రిల్లర్ కం ఒక అడ్వెంచర్ సీరీస్ గా వచ్చిన స్క్విడ్ గేమ్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది. స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఈమధ్యనే స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా వదిలారు. స్క్విడ్ గేమ్ సీజన్ 3 కూడా వచ్చేస్తుంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ స్క్విడ్ గేమ్ లో మన స్టార్స్ పాల్గొంటే ఎలా ఉంటుంది అన్నది ఏఐ వీడియోస్ చేశారు నెటిజన్లు.
ఐతే లేటెస్ట్ గా మరో వీడియో సిద్ధం చేశారు. ఈసారి నందమూరి బాలకృష్ణ, అనసూయ, రాజీవ్ కనకాలతో ఈ వీడియో వచ్చింది. స్క్విడ్ గేమ్ లానే ఇచ్చిన చాక్లెట్స్ ని ఇచ్చిన ఆకారంలో కట్ చేయాల్సి ఉంటుంది. అలా అనసూయ ట్రయాంగిల్ ని తీసి గెలుస్తుంది. రాజీవ్ కనకాల చాక్లెట్ ని ముక్కలు చేస్తాడు. అప్పుడు ముసుగు వేసుకున్న వాళ్లు వచ్చేసి తీసుకెళ్తారు.
ఇక నెక్స్ట్ బాలకృష్ణ కూడా కొంతవరకు ట్రై చేసి ఆ చాక్లెట్ ని తినేస్తాడు. ఇక బాలయ్యని బంధించేందుకు వస్తున్న వాళ్లను కూడా బాలయ్య అఖండ 2 స్టైల్ మాదిరిలో ఫైట్ చేస్తాడు. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లు కూడా అది స్క్విడ్ గేమ్ అయినా కూడా అక్కడ కూడా బాలయ్య మాటే వినాలి.. ఆయన చెప్పినట్టే ఆడాలని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
స్క్విడ్ గేమ్ ఏఐ వీడియోలో ఏ.ఐ వీడియోనే అయినా స్క్విడ్ గేమ్ డ్రెస్ లో బాలయ్య భలే ఉన్నాడనిపించింది. స్క్విడ్ గేమ్ సీరీస్ లకు సౌత్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అన్నది ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆ వీడియో చివర్లో జై బాలయ్య అంటూ ఎన్ టీ ఆర్ వాయిస్ తో పెట్టి నందమూరి ఫ్యాన్స్ అందరినీ టచ్ చేశారు.
బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖండ 2 ని రిలీజ్ చేసే పనులో ఉన్నాడు. సెప్టెంబర్ 25న అఖండ 2 వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా లాక్ చేసుకున్నాడు. ఇప్పటివరకు వచ్చిన వీడియోల్లో ఇదే బెస్ట్ క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఐతే స్క్విడ్ గేమ్ లో కూడా అనసూయ ని పెట్టే రేంజ్ లో అమ్మడి పాపులారిటీ ఏర్పడింది.
