బాలయ్య దబిడి దిబిడి ప్లాన్.. మోత మోగిపోవాల్సిందే..!
ఆయన చేసేవి యాక్షన్ సినిమాలే అన్న టాక్ నుంచి యాక్షన్ తో పాటు ఈమధ్య కొన్ని స్పెషల్ స్టోరీస్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాడు బాలకృష్ణ
By: Tupaki Desk | 7 May 2025 6:21 PMప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆయన చేసేవి యాక్షన్ సినిమాలే అన్న టాక్ నుంచి యాక్షన్ తో పాటు ఈమధ్య కొన్ని స్పెషల్ స్టోరీస్ చేస్తూ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని మెప్పిస్తున్నాడు బాలకృష్ణ. రీసెంట్ గా డాకు మహారాజ్ తో వచ్చి అలరించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య, బోయపాటి ఈ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. అదీగాక అఖండ సూపర్ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే బాలయ్య అఖండ 2 తర్వాత మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా లాక్ చేసుకున్నాడు. వీర సింహా రెడ్డి తర్వాత గోపీచంద్ తో మళ్లీ బాలయ్య సినిమా రెడీ అవుతుంది. ఐతే ఆ సినిమా తర్వాత మళ్లీ మరో సూపర్ హిట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమా తీసి హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.
ఇప్పుడు మళ్లీ ఆ ఇద్దరి కాంబో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఐతే అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో ఆ సినిమా వస్తుంది. ఐతే ఆ తర్వాత వెంకటేష్ తో F4 చేయాలనే ప్లాన్ ఉందట. ఐతే దానితో పాటు బాలకృష్ణ సినిమా కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ముందు వెంకటేష్ తోనా, బాలకృష్ణ సినిమా అన్నది తెలియదు కానీ కచ్చితంగా మళ్లీ బాలయ్య తో అనిల్ సినిమా మాత్రం ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చెబుతున్నాయి.
స్టార్ డైరెక్టర్ గా అసలు ఫెయిల్యూస్ లేని అనిల్ రావిపూడి పటాస్ నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం వరకు అదరగొట్టేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ సినిమా కథ సిద్ధం చేసి హీరోని కూడా ఓకే చేసుకుంటున్నాడు అనిల్. ప్రస్తుతం ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే కష్టం అనుకుంటుంటే డైరెక్టర్ గా అనిల్ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ ఆ సినిమాలతో సక్సెస్ కూడా కొడుతున్నాడు. సో బాలయ్యతో అనిల్ ఈసారి భగవంత్ కేసరి కాదు దానికి మించి సినిమా తీసేలా ప్లాన్ ఉంటుందని తెలుస్తుంది.