Begin typing your search above and press return to search.

బాల‌య్య‌..ర‌వితేజ మ‌ళ్లీ బ‌రిలోకి దిగెదెప్పుడు?

ఏ స్టోరీకి ఒకే చెప్పిన‌ట్లు కూడా ప్ర‌చారంలో లేదు. సుకుమార్ లాంటి స్టార్ మేక‌ర్ సైతం బాల‌య్య సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:30 PM GMT
బాల‌య్య‌..ర‌వితేజ మ‌ళ్లీ బ‌రిలోకి దిగెదెప్పుడు?
X

న‌ట‌సింహం...మాస్ రాజాలు మ‌ళ్లీ బ‌రిలోకి దిగేదెప్పుడు? రెట్టించిన ఉత్సాహంలో దూసుకుపోతున్న సింహం త‌దుప‌రి ఎలాంటి కంటెంట్ తో రాబోతుంది? నిరుత్సాహంలో ఉన్న మాస్ రాజా త‌దుప‌రి ఎలాంటి ప్ర‌ణాళిక‌తో రాబోతున్నాడు? వంటి అంశాలు ఇండ‌స్ట్రీ సహా ప్రేక్ష‌కుకాభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి. బాల‌య్య ఇటీవ‌లే `భ‌గ‌వంత్ కేస‌రి`తో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే.

`అఖండ‌`.. `వీర‌సింహా రెడ్డి` త‌ర్వాత `భ‌గ‌వంత్ కేస‌రి`తో మ‌రోసారి హ్యాట్రిక్ న‌మోదు చేసారు. దీంతో బాల‌య్య త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారు? ఏ ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇస్తున్నారు? ప్రాజెక్ట్ ఇదే ఏడాది ప‌ట్టాలెక్కిస్తారా? 2024 లో ప్రారంభిస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌కులంతా క్యూలో ఉన్నారు. కానీ ఆయ‌న ఎవ‌రికీ ఇంకా డేట్లే కేటాయించ‌లేదు.

ఏ స్టోరీకి ఒకే చెప్పిన‌ట్లు కూడా ప్ర‌చారంలో లేదు. సుకుమార్ లాంటి స్టార్ మేక‌ర్ సైతం బాల‌య్య సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న ఓవైపు పాన్ ఇండియా చిత్రం పుష్ప‌-2 తో బిజీగా ఉన్నా సుకుమార్ పేరు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బాల‌య్య ఉన్న వేవ్ లో సుకుమార్ తో సినిమా చేస్తే! ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇక ర‌వితేజ వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.

భారీ ఆశ‌లు..అంచ‌నాలతో రిలీజ్ చేస్తే ప్ర‌తీ సినిమా ఊహించ‌ని ఫ‌లితాన్ని ఇస్తుంది. ఇటీవ‌లే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని అంతా భావించారు. కానీ ఫ‌లితం అందుకు భిన్నంగా క‌నిపించింది. చేతిలో సినిమాలైతే ఉన్నాయి గానీ..వాటిపై కాన్పిడెన్స్? మాటేంటి? అంటే క్లారిటీ రావ‌డం లేదు. ప్ర‌స్తుతం `ఈగ‌ల్` అనే సినిమా చేస్తున్నారు. అలాగే గోపీచంద్ మ‌లినేనితోనే మ‌రో సినిమా ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తారు? ఈగ‌ల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వంటి వాటిపై క్లారిటీ లేదు.