Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్ కి ఓటీటీ డబుల్ ధమాకా

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఈ వారం చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. ఆయన నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న భగవంత్ కేసరి సినిమా ఎట్టకేలకు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:07 AM GMT
బాలయ్య ఫ్యాన్స్ కి ఓటీటీ డబుల్ ధమాకా
X

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఈ వారం చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. ఆయన నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న భగవంత్ కేసరి సినిమా ఎట్టకేలకు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ అవుతోంది. పెద్దగా హడావుడి చేయకుండానే అమెజాన్‌ ప్రైమ్‌ వారు బాలయ్య భగవంత్ కేసరి సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించాడు. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్ గా కనిపించింది. బాలయ్య మార్క్‌ మాస్ మూవీ అన్నట్లుగా కాకుండా కొన్ని సున్నితమైన ఎలిమెంట్స్ ను టచ్‌ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ కమర్షియల్‌ మూవీగా దర్శకుడు రూపొందించాడు.

థియేట్రికల్‌ రిలీజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ ద్వారా భగవంత్‌ కేసరి వచ్చేశాడు. దాంతో రాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌ పై బాలయ్య ఫ్యాన్స్ దాడి చేసినట్లుగా సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

బాలయ్య భగవంత్ కేసరి సినిమా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటే మరో వైపు ఆహా ఓటీటీ లో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. యానిమల్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు అయిన రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న మరియు దర్శకుడు సందీప్ వంగ లు ఈ వారం ఎపిసోడ్‌ లో బాలయ్య తో సందడి చేశారు.

ప్రోమో విడుదల అయినప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఎపిసోడ్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు నేడు అన్‌ స్టాపబుల్‌ యానిమల్‌ ఎపిసోడ్‌ ను ఆహా వారు స్ట్రీమింగ్‌ చేశారు. ఒకే రోజు ఓటీటీ ద్వారా బాలయ్య డబుల్ ధమాకా అన్నట్లుగా వినోదాన్ని పంచడానికి రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య డబుల్ ధమాకా మాత్రమే కాకుండా ఈ వారం లో మరికొన్ని సినిమాలు మరియు సిరీస్ లు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొత్తానికి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు ఫుల్ అంటూ ఓటీటీ కంటెంట్‌ ను విశ్లేషించే వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.