Begin typing your search above and press return to search.

బాల‌య్య‌తో వంశీ..వాళ్లిద్ద‌రి వ‌ద్ద‌ ముందు ట్యాష‌న్!

ఈ నేప‌థ్యంలో వంశీ పైడిప‌ల్లి లాంటి క్లాసిక్ డైరెక్ట‌ర్ బాల‌య్య‌తో సినిమా అంటే ఎలాంటి బ‌జ్ ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 12:08 PM GMT
బాల‌య్య‌తో వంశీ..వాళ్లిద్ద‌రి వ‌ద్ద‌ ముందు ట్యాష‌న్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ తో సినిమా చేయ‌డం అంటే ఆషామాషీ కాదు. ఆయ‌న ప‌ల్స్..మాజ్ ఇమేజ్ ని ప‌ట్టుకుని క‌థ రాయాలి. ఆన్ సెట్స్ లో అంత‌కు మించి ఊపేచ్చేలా తీయాలి. ఇలా తీయ‌డం టాలీవుడ్ లో కొంద‌రికే చెల్లింది. పాత త‌రం ద‌ర్శ‌కులు రిటైర్మెంట్ ఇచ్చిన త‌ర్వాత ఆ స్థానంలో బోయ‌పాటి శ్రీను నిలిచారు. 'సింహ‌'..'లెజెండ్'..'అఖండ' లాంటి చిత్రాల‌తో బాల‌య్య కి కొత్త ఐడెంటిటీని ఇచ్చారు.

బోయ‌పాటి మాస్ సినిమా తీస్తే అది బాల‌య్య‌తో మాత్ర‌మే తీయాలని బ‌ల‌మైన ముద్ర ప‌డింది. ఆ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని లాంటి వారు బాల‌య్య‌తో సినిమా చేసి స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి 'భ‌గ‌వంత్ కేస‌రి' చేస్తున్నారు. అనీల్ కూడా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ కావ‌డంతో! బాల‌య్య‌ని ఎలా చూపించాలో తెర‌పై అలా హైలైట్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు.

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌- వాల్తేరు వీర‌య్య‌తో చిరుకి భారీ మాస్ హిట్ ఇచ్చి బాబితో ఓ సినిమా చేయ‌నున్నారు. బాబి సైతం ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్. హిట్ కంటెంట్ నే తీస్తార‌న్న‌ది అభిమానుల న‌మ్మ‌కం. ఇలా ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్లు ఈజీగా సెట్ అవుతుంటాయి. ఈ నేప‌థ్యంలో వంశీ పైడిప‌ల్లి లాంటి క్లాసిక్ డైరెక్ట‌ర్ బాల‌య్య‌తో సినిమా అంటే ఎలాంటి బ‌జ్ ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ విష‌యాన్ని ముందే ఊహించిన వంశీ పైడిప‌ల్లి! బాల‌య్య తో సినిమా చేయాలంటే ముందుగా గోపీచం ద్ మ‌లినేని... బాబి లాంటి వాళ్ల ద‌గ్గ‌ర ట్యూష‌న్ తీసుకోవాల‌ని అన్నారు. బాల‌య్య‌ని ఎలా ప్ర‌జెంట్ చేయాలో వాళ్ల‌కు తెలిసిన‌ట్లు గా త‌న‌కి తెలియ‌ద‌నే చెప్ప‌క‌నే చెప్పారు. వాళ్ల ద‌గ్గ‌ర పనిచేస్తే గానీ బాల‌య్య‌కి ఎలాంటి క‌థ రాయాలి...ఎలా చూపించాలి? అన్న‌ది తెలియ‌ద‌న్నారు.

ఆ ప‌ని త‌ప్ప‌కుండా చేస్తాన‌న్నారు. వాళ్లిద్ద‌రి ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకున్న అనంత‌రం త‌ప్ప‌కుండా బాల‌య్య‌తో సినిమా చేస్తానని అన్నారు. అంటే సినిమా స్పీడ్ గా ఎలా పూర్తి చేయాలో రాజ‌మౌళి..పూరి జ‌గ‌న్నాధ్ వ‌ద్ద నేర్చుకుంటాను అన్నట్లే ఉందీ క‌థ‌.