Begin typing your search above and press return to search.

ఎన్నికల కోసం బాల‌య్య షూటింగులు బంద్?

ఆంధ్రప్రదేశ్ (AP) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల చేయనుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:18 AM IST
ఎన్నికల కోసం బాల‌య్య షూటింగులు బంద్?
X

ఆంధ్రప్రదేశ్ (AP) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల చేయనుంది. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు కానుంద‌ని స‌మాచారం. దీంతో ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న స్టార్లు అంతా ఒక్కొక్క‌రుగా షూటింగుల‌కు బ్రేక్ ఇవ్వ‌నున్నార‌ని తెలిసింది.

ముఖ్యంగా న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ కూడా ఎన్నికల సంఘం ప్రకటనను దృష్టిలో ఉంచుకుని త‌న షూటింగ్ షెడ్యూళ్ల‌ను స‌వ‌రించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. తాను ఎన్నికల్లో పాల్గొంటున్నందున ఆ రోజుతో షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించిన రోజు నుండి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన యోచిస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మరో పది రోజుల పాటు షూటింగ్ జరగనుంది. అటుపై ఎన్నిక‌ల కోసం బాల‌య్య వంద‌శాతం అంకిత‌మ‌వుతారు. ఆయ‌న‌ తిరిగి సెట్స్‌పైకి రావడానికి బాబీ అతని బృందం అదనంగా మరో రెండు నెలలు వేచి ఉండాలి. సెప్టెంబర్ లేదా అక్టోబరులో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల‌క్ష‌న్ బ్రేక్ తో సినిమాని అనుకున్న విధంగా రిలీజ్ చేయాలంటే ద‌ర్శ‌కుడు చాలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో ఉండాల్సి ఉంది.