Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే న‌మ్ముకున్న బాల‌య్య

అయితే ఈ సెంటిమెంట్‌లు ఇండ‌స్ట్రీలో మిగ‌తా వారితో పోలిస్తే టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కాస్త ఎక్కువే అన్న‌ది తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Oct 2023 9:10 AM GMT
మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే న‌మ్ముకున్న బాల‌య్య
X

ఇండ‌స్ట్రీలో ఏ ప‌నిని ప్రారంభించినా ముహూర్త‌లు, సెంటిమెంట్‌లు చూసుకోవ‌డం కామ‌న్‌. చివ‌రికి సినిమా రిలీజ్ కి కూడా మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసి తేదీ, టైమ్‌, గ‌డియ‌లు అంటూ చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ సెంటిమెంట్‌లు ఇండ‌స్ట్రీలో మిగ‌తా వారితో పోలిస్తే టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కాస్త ఎక్కువే అన్న‌ది తెలిసిందే. ఆయ‌న ప్ర‌తి విష‌యాన్ని ముహూర్త‌లు, గ‌డియ‌లతో ముడిపెడుతూ ఉంటారు. అది ఆయ‌న సెంటిమెంట్‌.

త‌ను న‌మ్మే సెంటిమెంట్ ప్ర‌కార‌మే ఆయ‌న సినిమాలు చేస్తుంటారు. కొన్ని ర‌కాల రింగ్‌లు ధ‌రిస్తే ఈ ప‌ని జ‌రుగుతుంద‌ని, లేక‌పోతే జ‌ర‌గ‌ద‌ని బాల‌య్య సెంటిమెంట్‌. ఆ సెంటిమెంట్‌లో మెగా రింగ్‌ని ధ‌రించిన బాల‌య్య ఆ సెంటిమెంట్‌లో 'అఖండ‌' మూవీతో భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు. వ‌రుస ఫ్లాపుల త‌రువాత ఓ స్వామిజీ చెప్పిన కార‌ణంగా సెంటిమెంట్‌గా భావించి మెగా రింగ్‌ని ధ‌రించిన బాల‌య్య ఆ రింగ్ మ‌హ‌త్యంతో అఖండ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకుని మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. థియేట‌ర్లు తెర‌చుకున్నా యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది. దీంతో మెగా రింగ్‌ని బాల‌య్య సెంటిమెంట్‌గా భావించారు. ఆ త‌రువాత సినిమాకు కూడా దాన్ని కొన‌సాగిస్తార‌ని ఫ్యాన్స్ భావించారు కానీ అది జ‌ర‌గ‌లేదు. 'వీర సింహారెడ్డి'కి ఆ మగా రింగ్‌ని ప‌క్క‌న పెట్టారు. ఫ‌లితం యావ‌రేజ్ హిట్.

అయితే ఈ సారి అలాంటి త‌ప్పు జ‌ర‌గొద్ద‌ని భావించిన బాల‌య్య ఈ నెల 19న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న 'భ‌గ‌వంత్ కేస‌రి' కోసం మెగా రింగ్ పెంటిమెంట్‌ని ఫాలో అయ్యారు. ఈ సినిమాలో మెగా రింగ్‌ని పెట్టుకుని మ‌ళ్లీ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఆయ‌న సెంటిమెంట్ ప్ర‌కారం 'భ‌గ‌వంత్ కేస‌రి' బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందిస్తుందా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.